ఈ మద్య మహిళలపై దారుణమైన దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.  ప్రపంచంలో లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్య కేసులు ఎన్నో నమోదు అవుతున్నాయి.  నిన్నటికి నిన్న తెలంగాణలో రెండు దారుణ ఘటనలు జరిగిన విషయం తెలిసిందే.  ఇంటర్ చదువుతున్న అమ్మాయిని ఆమె స్నేహితుడు అత్యాచారం చేసి చంపాడు.. వెటర్నరీ డాక్టర్ గా చేస్తున్న ప్రియాంక రెడ్డి అనే యువతిని నలుగురు కామాంధులు అత్యంత పాశవికంగా గ్యాంగ్ రేప్ చేసి చంపి దహనం చేశారు.  అయితే ఈ దాడులు సామాన్య మహిళలపైనే కాదు.. సెలబ్రెటీలపై కూడా జరుగుతున్నాయి.

 

తాజాగా అమెరికాలోని న్యూయార్క్‌లోని బార్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ హాలీవుడ్ నటిపై కొందరు దుండగులు దాడి చేశారు.  హాలీవుడ్ న‌టి జెన్నిఫ‌ర్ అగోస్టిని, ఆమె ఫ్రెండ్‌పై గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు దాడి చేశారు. న్యూయార్క్‌లోని మాన్‌హ‌ట్ట‌న్‌లోని స్కైరూం బార్‌లో పార్టీ చేసుకున్న త‌ర్వాత జెన్నిఫర్ త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి తెల్ల‌వారుజామున 3 గంట‌ల స‌మ‌యంలో బ‌య‌ట‌కి వ‌చ్చింది. ఆ సమయంలో కొంత మంది ఆకతాయిలు ‘మీలాంటి తెల్ల ఆడకుక్కల దగ్గర డబ్బు ఉంది కాబట్టే ఇలా తాగి తిరుగుతున్నారు’ అంటూ వారిపై దాడి చేశారు.   జెన్నిఫ‌ర్ అగోస్టి రక్తం కారేలా దారుణంగా కొట్టారు.. విషయం తెలుసుకొని బార్ సిబ్బంది వారిని అడ్డుకొని హాస్పిట‌ల్‌కి త‌ర‌లించారు.

 

నిందితుల‌ని పోలీసుల‌కి అప్ప‌గించారు.  అయితే అక్కడ బార్ లో  ఆఫ్రిక‌న్‌, అమెరికన్స్ సెక్యూరిటీ గార్డులుగా ప‌ని చేస్తున్నారు. తమ పని ముగించుకొని వెళ్లిపోయారు..అయితే వారిలో ఓ వ్యక్తి తన క్రెడిట్ కార్డు మర్చిపోవడంతో బార్ క్లోజింగ్ సమయానికి రావడం..అక్కడ సిబ్బంది అతనిని ఆపడంతో అసహనానికి గురయ్యాడు. దాంతో ఆ కోపం దే స‌మ‌యంలో త‌న స్నేహితుల‌తో క‌లిసి బ‌య‌ట‌కి వ‌స్తున్న జెన్నీఫ‌ర్‌ని చూసి కోపంతో ఊగిపోయిన వ్య‌క్తి వారి స్నేహితుల‌తో క‌లిసి దాడి చేశాడు.

 

ర‌క్తం వ‌చ్చేలా కొట్టాడు.  దాడికి గురైన   జెన్నీఫ‌ర్‌ కి ఐదు కుట్లు పడ్డాయి. నటిపై జాతి వివక్ష దాడి జరగడం అమానుషం అని ఆమె అభిమానులు మండిప‌డుతున్నారు. జెన్నిఫర్ ‘బ్లూక్లిన్ టైస్’ అనే సినిమాలో నటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: