దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను రెండు భాగాలుగా తెరకెక్కించి పరాజయాన్ని చవిచూసిన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం లో రూలర్ అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవల సోషల్ మీడియా రిలీజ్ చేయడంతో బాలయ్య బాబు గతంలో లేని విధంగా ఈ సినిమాలో అదిరిపోయే గెటప్ లో ఉండటంతో నందమూరి అభిమానులు...బాలయ్య బాబు లుక్ చూసి సినిమా విడుదల కాకముందే ఖచ్చితంగా రూలర్ సినిమా బ్లాక్ బస్టర్ అనే కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య బాబు పక్కన ఇద్దరు హీరోయిన్లు గా సోనాల్ చౌహన్, వేదిక నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు బీభత్సంగా పెట్టుకున్నారు ఫ్యాన్స్.

 

అంతేకాకుండా ఈ సినిమాలో భూమిక కీలక పాత్రలో నటిస్తున్న నేపథ్యంలో సినిమాపై మరింత ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 20వ తారీఖున ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో …. రూలర్ సినిమాతో బాలయ్య హిట్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా అయిన వెంటనే తన కెరీర్లో రెండు మర్చిపోలేని బ్లాక్ బస్టర్ విజయాలు అందించిన డైరెక్టర్ బోయపాటి శ్రీను తో బాలయ్య బాబు చేయబోయే సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

 

విషయంలోకి వెళితే ఈ సినిమాతో ఎలాగైనా హ్యాట్రిక్ హిట్ కొట్టాలని భావిస్తున్న బోయపాటి.. గతంలో తెరకెక్కించిన రెండు సినిమాల్లో వాడిన సేమ్ సక్సెస్ ఫార్ములా… ఈ సినిమాలో కూడా వాడుతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. విషయంలోకి వెళితే వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న మూడో సినిమా లో సింహా, లెజెండ్ సినిమాల మాదిరిగా బాలయ్య డ్యూయల్ రోల్ తో పాటు అదిరిపోయే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తో బోయపాటి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: