వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కి ప్రతీది కెలికి కంపు చేసుకోవడంలో ముందుంటాడు. అదేమి ఆనందమో గాని చేసే ప్రతీ పనిలో కాంట్రవసీలే. ఇది బిజినెస్ స్ట్రాటజీనా లేక ఆయనకున్న పైత్యమా అర్థం కాదు. రచ్చ లేకుండా చేయకుండా కుదురుగా ఒక్క సినిమా తీయలేడు. తాజాగా తెరకెక్కించిన 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాపై వస్తున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు.. గత ఎన్నికల సమయంలో.. అనంతర రాజకీయ పరిణామాలపై తీసిన ఈ సినిమా ఈవారం విడుదల చేయడానికి ప్లాన్ చేసినా సెన్సార్ అవకపోవడంతో అది కాస్త వాయిదా పడింది. ఇక 'కమ్మ రాజ్యంలో కడపరెడ్లు' సినిమాలో తనను కించపరిచాడని కేఏపాల్ హైకోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. విచారించిన కోర్టు వారంలో సినిమా చూసి నిర్ణయం తీసుకోవాలని సెన్సార్ బోర్డును తెలిపింది.

 

ఇక మరో వివాదమూ చుట్టుముట్టింది. ఈ సినిమా పేరు కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఉందని టైటిల్ మార్చాలంటూ కొందరు హైకోర్టుకెక్కారు. ఇలా అన్ని అభ్యంతరాలను పరిష్కరించుకుంటూ వస్తున్న దర్శకుడు రాంగోపాల్ వర్మకు తాజాగా ఏపీలోని జగన్ సర్కారు గట్టి షాకిచ్చింది. 'కమ్మ రాజ్యంలో కడపరెడ్లు' సినిమా పేరును మార్చాలని తాజాగా జగన్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి రీజనల్ సెన్సార్ బోర్డు అధికారులకు లేఖ రాయడం సంచలనం అయింది. అంతేకాదు ఈ సంచలన దర్శకుడికి షాకిచ్చింది. కులాల మధ్య చిచ్చుపెట్టేలా ఈ టైటిల్ ఉందని.. ప్రజల్లో అలజడి రేపేలా ఉందని మార్చాలని వర్మకు సూచించారు.

 

చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వర్మ.. జగన్ పై ప్రేమతోనే ఈ సినిమా తీశాడని జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జగన్ సర్కారు కూడా ఈ సినిమాపై అభ్యంతరం తెలుపడం ఉభయ రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక హైకోర్టు సూచన, జగన్ సర్కారు అభ్యంతరాల నేపథ్యంలో సినిమా టైటిల్ ను 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' గా మారుస్తానంటూ ఇప్పటికే వర్మ ప్రకటించారు. అయితే సంచలనం అవడానికే ఈ టైటిల్ పెట్టాడని ముందే 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' అన్న టైటిల్ పెడితే ఈ వివాదాలు వచ్చేవి కాదని ఇదంతా వర్మ బిజినెస్ స్ట్రాటజీ అని కొంతమంది చెప్పుకుంటున్నారు. ఆలోచిస్తే ఇందులో వాస్తవముందనిపించడంలో సందేహం లేదు కదా..! 

మరింత సమాచారం తెలుసుకోండి: