తెలుగు రాష్ట్ర ప్రజలు ఉలిక్కి పడేలా చేసింది పశు వైద్యాధికారిణి  ప్రియాంక రెడ్డి హత్య. నలుగురు ఉన్మాదులు..కృర మృగాళ్లా  ప్రియాంక రెడ్డి పై అత్యాచారం చేసి కిరోసిన్ పోసి దహనం చేసిన ఘటన సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టించింది. మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట మండలం కొల్లూర్‌ గ్రామంలో వెటర్నరీ డాక్టర్ గా పనిచేస్తోన్న ప్రియాంక శంషాబాద్ లోని తన ఇంటికి వచ్చే సమయంలో కొందరు దుండగులు ఈ ఘటనకు పాల్పడ్డ విషయం తెలిసిందే. ఔటర్‌ రింగ్ రోడ్డుపై కిడ్నాప్‌ చేసి, అత్యాచారం చేసి ఆమెను 28 కి.మీ. దూరానికి డీసీఎంలో తీసుకెళ్లి సజీవ దహనం చేసినట్లు తెలిసింది.  

 

ఈ ఘటనకు సంబంధించిన సమాచారం పోలీసులకు ఆలస్యంగా అందిందని అన్నారు. కాగా, ప్రియాంకరెడ్డి కుటుంసభ్యులను సజ్జనార్ పరామర్శించారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించలేదని ప్రియాంక తల్లిదండ్రులు ఆరోపించారు.   మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడిస్తామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. తాజాగా ఈ విషయంపై సినీ సెలబ్రెటీలు చాలా ఎమోషనల్ గా స్పందిస్తున్నారు.  

 

ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరో కార్తికేయ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. గుణ 369 సినిమా క్లైమాక్స్ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడే తాను నాలుగు ఐదు రోజులు చాలా ఆందోళన..ఇబ్బంది పడ్డానని అన్నారు.  అలాంటిది నిజంగా అలాంటి ఘటన జరగడం, మనం దాని గురించి ఏమీ చేయలేకపోవడం సిగ్గు చేటని అన్నారు. నిజంగా సమాజంలో ఇంత నీజమైన మృగాళ్లు ఉన్నారా అనిపిస్తుంది. ప్రియాంక ఆత్మ ఎలానూ శాతించదని, అందుకే రెస్ట్ ఇన్ పీస్ సొసైటీ అనడం బెటర్ అని చెబుతూ 'సారీ సిస్టర్ నిన్ను కాపాడుకోలేకపోయాం' అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చాడు.   

 


ఇక హీరో రామ్ పోతినేని చాలా ఆగ్రహంగా పోస్ట్ చేశాడు. ప్రియాంక హత్య ఘటనపై తనెంత ఆగ్రహంతో ఉన్నాననే విషయాన్ని రామ్ ట్వీట్ ద్వారా తెలిపాడు.  ఇక ఇలాంటి దారుణాలకు పాల్పపడే వారికి 'భయం.. ఇలాంటి ఆలోచన వస్తే భయం వేసేలా ఒక్క తీర్పు.. అప్పటిదాకా వీళ్ళలో రాదు మార్పు' అని రామ్ ట్వీట్ చేశాడు. ఏది ఏమైనా ఓ నిండు ప్రాణం బలికావడం తెలుగు రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: