అష్టా చెమ్మా సినిమాతో హీరోగా పరిచయమై అలామొదలైందితో కూల్ హిట్ కొట్టాడు నాని.. ప్రస్తుతం రెండు సినిమాలు చేతిలో ఉన్నా ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తనకే తెలియదు అని చెబుతున్నాడు.. రీసెంట్ గా జరిగిన ఉయ్యాల జంపాల సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమంలో నాని తను కృష్ణ వంశీ డైరక్షన్లో వస్తున్న పైసా సినిమా ఎప్పుడు రిలీజో తనకు తెలియదు అని చెప్పాడు. అసలైతే ఆ సినిమా 6 నెలల క్రితం నుండి రిలీజ్ ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు నిర్మాత రమేష్ పుప్పాల.ఈలోపు తను సముద్ర ఖని దర్శకత్వంలో వస్తున్న జండాపై కపిరాజు సినిమా జనవరిలో రిలీజ్ చేయాలని తెగ హడావిడి చేస్తున్నారు..మరి ఆ సినిమా అయినా టైం కి రిలీజ్ అవుతుందో లేదో చూడాలి మరి..సో తన సినిమా రిలీజ్ ఎప్పుడో తెలియని నాని ని చూసి పాపం అంటున్నారు సినీ వర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: