టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా అలవైకుంఠపురములో. గతంలో త్రివిక్రమ్ మరియు అల్లు అర్జున్ ల కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు మంచి హిట్ సాధించడంతో ఈ సినిమా కూడా మంచి హిట్ సాధించి హ్యాట్రిక్ అందుకోవాలనే ఉద్దేశ్యంతో హీరో, దర్శకులిద్దరూ కూడా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా నుండి ఇప్పటివరకు విడుదలైన మూడు సాంగ్స్ కూడా శ్రోతల నుండి మంచి రెస్పాన్స్ సంపాదించడంతో పాటు సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు కూడా పెంచేయడం జరిగింది. 

 

ఇకపోతే ఈ సినిమా అఫీషియల్ టీజర్ కూడా మరికొద్దిరోజుల్లో రిలీజ్ కానుంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ భామగా పేరుగాంచిన పూజ హెగ్డే ఈ సినిమాలో బన్నీ సరసన హీరోయిన్ గా నటిస్తుండడంతో సినిమా తప్పకుండా సక్సెస్ సాధించడం ఖాయం అని అంటున్నారు సినీ విశ్లేషకులు. వాస్తవానికి తొలి సినిమా తరువాత పూజ హెగ్డే నటించిన సినిమాలు చాలావరకు ఫెయిల్ అయినప్పటికీ, ఇటీవల మాత్రం ఆమె నటిస్తున్న సినిమాలు మాత్రం వరుసగా మంచి సక్సెస్ అవుతున్నాయి. 

 

ఇక గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేతలో పూజనే హీరోయిన్ గా నటించగా ఆ సినిమా సూపర్ హిట్ కొట్టింది. అలానే ఆయన దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమాలో కూడా ఆమే మరొక్కసారి హీరోయిన్ గా నటిస్తుండడంతో, ఈ సినిమా కూడా తప్పకుండా సక్సెస్ సాధించే అవకాశం ఉందట. మరి పూజ గోల్డెన్ లెగ్ అలవైకుంఠపురములో కు ఎంతవరకు కలసి వస్తుందో చూడాలి. కాగా ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను జనవరి 12న రిలీజ్ చేయనున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: