2012 ఢిల్లీలో నిర్భయ, 2019 లో హైదరాబాద్ లో ప్రియాంక రెడ్డి..ఇద్దరు కరడు కట్టిన మానవ మృగాలకి బలైపోయారు. మానభంగం చేసి దారుణంగా హత్య చేశారు. అప్పటికి ఇప్పటికి ఏం మారింది. ఎంతమంది ఆడ పిల్లలు బలౌతారు. దీనికి అంతమే లేదా అంటే అటు పోలీసుల నుంచి గాని ఇటు రాజకీయ నాయకుల నుంచి గాని సమాధానం లేదు. ఎందుకింత బాధ్యతారహితం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనం సృష్ఠించిన డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్యకేసులో నలుగురు నింధితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఒంటరిగా వస్తున్న ప్రియాంక రెడ్డిని ట్రాప్ చేసి మాయమాటలు చెప్పి ఆమెను కిడ్నాప్ చేసి అసహాయ స్థితిలో ఉన్న ఆమెపై కామ మృగాల కంటే అతి దారుణంగా దాడి చేసి హతమార్చారు. ఈ కేసులో నిందితులైన నలుగురు 25 ఏళ్ల వయసు వాళ్ళేనని రుజువైంది. నారాయణ పేట, మక్తల్ మండలం జక్లేరుకు చెందిన మహ్మద్ పాషా అనే ఒక మృగాన్ని అరెస్టు చేశారు. 

 

ఈ కేసులో ఇతనే ప్రధాన నిందితుడు. ఈ నలుగురు పక్కా పథకం వేసే ప్రియాంకను అపహరించి, ఈ దారుణానికి పాల్పడారు. ప్రియాంకారెడ్డి స్కూటీని  ఉద్దేశపూర్వకంగానే పంక్చర్‌ చేసి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనపై తాజాగా సినీ నటులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ నటి అనుష్క స్పందిస్తూ.. ఇలాంటి దారుణానికి పాల్పడిన వారిని జంతువులతో పోలిస్తే అవి కూడా సిగ్గుపడతాయని చెప్పింది. అమాయకురాలైన ప్రియాంక రెడ్డిపై అత్యాచారం చేసి.. హత్య చేయడం సమాజాన్ని కదిలించే ఒక విషాదకరమైన సంఘటన. ఈ సమాజంలో ఒక ఆడపిల్లగా పుట్టడం తప్పా..నేరమా? అని ప్రశ్నించారు. ప్రియాంక రెడ్డి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నాను. 'రిప్ ప్రియాంక రెడ్డి' అని అనుష్క తన సానుభూతిని తెలిపింది.

 

ఇక ఈ ఘటనపై మరో నటి కీర్తి సురేష్ కూడా స్పందించింది. ఈ సంఘటన తన హృదయాన్ని కలచి వేసిందని, అత్యంత కౄరంగా ప్రియాంకా రెడ్డిని మానభంగం చేసి, హత్య చేశారని.. ఈ ఘటనల వలన అమ్మాయిలు రోడ్ల మీద తిరగాలంటే రోజురోజుకి భయం ఇంకా పెరిగిపోతుందని అన్నారు. మన దేశంలో ఆడవాళ్లకి భద్రత దొరకదా..? రోడ్డు మీద తిరిగే స్వేచ్చ కూడా లేదా అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ప్రియాంకా కుటుంబసభ్యులకు తన సానుభూతిని తెలిపింది. నటి పూనమ్ కౌర్ స్పందిస్తూ... పోలీస్ వ్యవస్థకు ఇది సిగ్గుచేటు చర్య అని.. ఇలా ప్రశ్నించడానికి వారికి సిగ్గుగా లేదా అంటూ మండిపడింది. వీరితో పాటు ఆర్.ఎక్స్ 100 ఫేం కార్తికేయ, రాం పోతినేని..ప్రియాంక పట్ల తమ సానిభూతిని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: