టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో సూపర్ డూపర్ హిట్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం అదే ఊపుతో ఆయన నటిస్తున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు. యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మహేష్, దిల్ రాజు, అనిల్ సుంకర ఎంతో ప్రతిష్టాత్మకంగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్, సినిమాపై బాగా అంచనాలు పెంచేయడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ సినిమా తప్పకుండా సక్సెస్ సాదిస్తుందని ఎంతో నమ్మకంగా ఉన్నారు. 

 

అయితే కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న ప్రకారం, ఇటీవల మహేష్ బాబు తన సినిమా కథల ఎంపికలో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారని సమాచారం. గతంలో తాను నటించిన సినిమాల్లో కొన్ని సినిమాలు ఫెయిల్ అవ్వడానికి తాను ఆ సినిమాల కథల పూర్తి స్క్రిప్ట్ వినకపోవడమే అని గ్రహించారట. ఆ విధంగా కొందరు దర్శకులు జస్ట్ సినిమా స్టోరీ లైన్ మాత్రమే చెప్పడంతో, వెంటనే షూటింగ్ మొదలెట్టేసేవారని, అలా చేసిన సినిమాలు చాలావరకు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయని భావించిన మహేష్, ఇకపై తన వద్దకు వచ్చే దర్శకులు సినిమా కథ విషయమై పూర్తిగా నారేషన్ ఇస్తేనే కానీ సినిమా చేయకూడదని నిశ్చయించారట. 

 

అయితే ఈ విషయమై చాలావరకు మహేష్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. గతంలో తాను చేసిన సినిమాల కథలు పూర్తిగా వినకుండా సెట్స్ మీదకు వెళ్లడంతో అవి ఫ్లాప్ అయ్యాయని భావించి ఇకపై అటువంటి తప్పిదాలు చేయకూడదని నిశ్చయించడం ఎంతో గొప్ప పరిణామం అని, దానివలన సినిమాలు ఎక్కువశాతం సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. కాగా ఇదే పద్దితిని మిగతా హీరోలు కూడా పాటిస్తే భవిష్యత్తులో పెద్ద హీరోల సినిమాలు మంచి సక్సెస్ సాధించి ఇండస్ట్రీ కి మంచి జరుగుతుందని అంటున్నారు విశ్లేషకులు.... !!

మరింత సమాచారం తెలుసుకోండి: