దేవదాసు సినిమాతో వెండితెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా ఇలియానా రెండో సినిమా పోకిరి తోనే ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు పక్కన హీరోయిన్ గా ఇలియానా నటించిన నటన అప్పట్లో ఉన్న కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. అంతేకాకుండా ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయి ...ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరి పక్కన నటించి వరుస ఆఫర్లు దక్కించుకుని విజయ్ హీరోయిన్ గా మారిపోయింది తన హవా ఏంటో చూపించింది ఇలియానా. అయితే ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ పై కన్ను వేసిన ఇలియానా అక్కడ చాలా సినిమాలు చేసినా గాని ఆ సినిమాలు ఏవి కూడా మంచి పేరు తీసుకు రాకపోవడంతో అదే క్రమంలో ఆమె ప్రేమ కూడా బ్రేకప్ కావడంతో డిప్రెషన్ లోకి వెళ్ళింది. తిరిగి కోలుకున్నాక మళ్ళీ సినిమాలపై ద్రుష్టి పెట్టింది.

 

ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇలియానా సంచలన విషయాలు బయట పెట్టింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో తాను అంతగా సక్సెస్ కాకపోవడానికి కొన్ని కారణాలు వివరించింది. పోకిరి ఘనవిజయం తర్వాత ఆ చిత్రాన్ని వాంటెడ్ పేరుతో హిందీలో రీమేక్ చేశారు. వాంటెడ్ చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ మూవీలో సల్మాన్ ఖాన్ కు హీరోయిన్ గా మొదట నన్నే అడిగారు. కానీ ఆ సమయంలో నేను పరీక్షలు రాస్తూ బిజీగా ఉన్నా.

 

దీనితో వాంటెడ్ చిత్రాన్ని రిజెక్ట్ చేశా. మరోసారి సల్మాన్ తో నటించే అవకాశం వచ్చింది. కిక్ చిత్రాన్ని హిందీలో అదే పేరుతో రీమేక్ చేశారు. ఆ చిత్రంలో కూడా హీరోయిన్ గా నన్నే అనుకున్నారు. కానీ ఆసమయంలో నేను బిజీగా ఉండడం వాళ్ళ డేట్స్ కుదర్లేదు. నాకు మాత్రం సల్మాన్ ఖాన్ తో నటించాలనే కోరిక ఉండేది. కానీ కుదర్లేదు అని ఇలియానా తెలిపింది. రెండు సినిమాలు చేసి ఉంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో నా కెరీర్ వేరేలా ఉండేది అంటూ ఇలియానా బాధపడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: