నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ బాలయ్య వారసుడుగా కొనసాగాలని లక్షలాది మంది నందమూరి అభిమానులు భావిస్తూ ఉంటే మోక్షజ్ఞ మాత్రం ఫిలిం ఎంట్రీ విషయమై ఏమాత్రం ఆసక్తి కనపరచడం లేదు అన్న వార్తలు గత కొద్ది కాలంగా వస్తూనే ఉన్నాయి. దీనికితోడు మోక్షజ్ఞను కనీసం బాలయ్య ఫిలిం ఫంక్షన్స్ కు కూడ తీసుకు రాకుండా చాల రహస్యంగా ఉంచుతున్న పరిస్థితులలో మోక్షజ్ఞ లేటెస్ట్ ఫోటోలు చాల రహస్యంగా లీక్ కావలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ఇలాంటి పరిస్థితులలో ఆ మధ్య ఒక కాఫీ షాపులో కనిపించిన మోక్షజ్ఞ ఫోటో వైరల్ అయితే ఇప్పుడు లేటెస్ట్ గా మోక్షజ్ఞ ఈ మధ్య తన ఫ్యామిలీలో జరిగిన ఒక ఫంక్షన్ సందర్భంగా కనిపించిన ఫోటో మరింత షాకింగ్ గా మారింది. ఈ ఫోటోలో మోక్షజ్ఞకు పొట్ట కూడ వచ్చినట్లు కనిపించడంతో పాటు అతడిని ఫోటో తీయడానికి ప్రయత్నిస్తున్న వారి పై మోక్షజ్ఞ కొద్దిగా అసహనాన్ని ప్రదర్శించినట్లు టాక్.

దీనితో ఒక టాప్ గ్లామర్ హీరో కొడుకుకు గ్లామర్ ఫీల్డ్ పై ఇలాంటి నైరాశ్యం ఏమిటి అంటూ బాలయ్య అభిమానులు మధన పడిపోతున్నారు. మోక్షజ్ఞకు సినిమా నటన అంటే ఇష్టం లేదనీ తాను ఇండస్ట్రీలోకి రానని ఇప్పటికే అతడు తన కుటుంబ సభ్యులకు చెప్పినట్లు గాసిప్పులు వచ్చాయి.

అయితే బాలయ్య కూతుళ్ళు మాత్రం తమ తమ్ముడుకి బ్రెయిన్ వాష్ చేస్తూ ఒక టాప్ హీరో కొడుకుగా పుట్టడం ఎంత అదృష్టమో అతడికి అర్ధం అయ్యే రీతిలో చెపుతూ బాలయ్య వారసత్వాన్ని కొనసాగిస్తే అతడికి వచ్చే కీర్తితో పాటు లక్షలాది మంది అభిమానుల ఆదరణ గురించి కూడ అతడికి నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు లీకులు వస్తున్నాయి. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా బాలయ్య కూతుళ్ళ మైండ్ వాష్ తో మోక్షజ్ఞ మనసు మారితే బాలయ్య అభిమానులకు పండుగ అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: