తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వెటర్నీ డాక్టర్ ప్రియాంక రెడ్డిపై అత్యాచారం చేసి దారుణంగా దహనం చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లోసంచలనం రేపింది. బుధవారం శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద గల టోల్ ప్లాజా సమీపంలో ప్రియాంక రెడ్డి కి చెందిన స్కూటీ పంక్చర్ ఐయ్యిందనీ, పక్కనే ఉన్న షాప్ దగ్గర పంక్చర్ వేయించి తీసుకొస్తామని చెప్పి ఆమెను పక్కదారి పట్టించి ప్రియాంకను బలవంతంగా చెట్ల పొదల్లోకి తీసుకు వెళ్లి మృగాళ్లలో ఆమెపై దాడి చేసి గ్యాంగ్ రేప్ చేశారు.  

 

ఆ తర్వాత చంపేసి ఆనవాళ్లు తెలియకుండా కాల్చి వేయాలని చూశారు.  పాపం పండి ఈ నలుగురు పోలీసులకు చిక్కిపోయారు.  ఈ ఘటనపై అన్నివర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత వినిపిస్తుంది. ఈ కిరాతకానికి పాల్పడినవారికి పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. అలాగే టాలీవుడ్ కి చెందిన చాలా మంది ప్రముఖులు దీనిపై స్పందించారు. కీర్తి సురేష్, లావణ్య త్రిపాఠి, మెహ్రిన్ పిర్జా, అల్లరి నరేష్, సుధీర్ బాబు,పూనమ్ కౌర్ వంటి వారు ఈ ఘటనకు వ్యతిరేకంగా ట్వీట్స్ వేశారు. తాజాగా నటి, రాజకీయ నాయకురాలు విజశాంతి సీరియస్ గా స్పందించారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన విజయశాంతి ఫేస్‌బుక్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. మదమెక్కిన మగ పిశాచాల దాష్టీకానికి మాతృ హృదయం తల్లడిల్లిపోతోందన్నారు.

 

ఇది సభ్య సమాజానికే తీరని కళంకమన్నారు. ఇలాంటి ఘాతుకాలకు తెగబడే ముందు అమ్మల కడుపున పుడుతున్న అన్నదమ్ములు ఒక్క క్షణం ఆలోచించాలని విజయశాంతి కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిద్ర మేల్కొనకపోతే మహిళా ఉద్యమం తథ్యమని హెచ్చరించారు.   మగపిల్లలను కనాలంటే కాబోయే అమ్మలు వద్దని అబార్షన్లు చేయించుకునేంత దౌర్భాగ్యాన్ని సృష్టించవద్దని విజయశాంతి కోరారు.  కామాంధుల కర్కశానికి ఓ వైద్యురాలు బలైపోయిందన్నారు.  తెలంగాణ సమాజానికి ఇది తీరని అవమానమని ఇలాంటి మానవ మృగాళ్లను నడి రోడ్డుపై బుద్ది వచ్చేలా శిక్షించాలని అన్నారు. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: