నిన్న విడుదలైన ‘అర్జున్ సురవరం’ మూవీకి ఎబౌ ఎవరేజ్ టాక్ రావడంతో ఫెయిల్యూర్ గండం నుండి నిఖిల్ గట్టెక్కినా కలక్షన్స్ పరంగా ఈ మూవీ ఏ మేరకు విజయం సాధిస్తుంది అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కలక్షన్స్ పరంగా ఈ మూవీని నిలబెట్టాలని నిఖిల్ చాలగట్టి ప్రయత్నాలు చేస్తూ ఈ మూవీ ప్రమోషన్ ను కొనసాగిస్తున్నాడు. 

ఈ నేపధ్యంలో ఈ మూవీ షూటింగ్ సమయంలో నటుడు పోసాని కృష్ణమురళిమూవీ దర్శకుడు సంతోష్ ని బూతులతో తిట్టిన ఒక ఆసక్తికర విషయాన్ని లీక్ చేసాడు. ఈ మూవీకి సంబంధించిన ఒక సీన్ ను దర్శకుడు ఐదు రోజులు తీసాడట. 

ఆ సీన్ లో విలన్ పోసానిని బూటు కాలుతో గట్టిగా గుండెల పై కొట్టే సీన్ ఉందట. అయితే ఆ సీన్ దర్శకుడు అనుకున్నట్లుగా రాకపోవడంతో పోసానిని క్లోజప్ లో విలన్ కు బదులు ఒక జూనియర్ ఆర్టిస్ట్ చేత కొట్టించాడట. అయితే పోసానికి ఆ జూనియర్ ఆర్టిస్ట్ కొట్టిన దెబ్బ చాల గట్టిగా తగలడంతో ఆ జూనియర్ ఆర్టిస్ట్ పై పోసాని తీవ్ర అసహనం వ్యక్త పరిచాడట. 

చివరకు దర్శకుడు తనను పోసనిని గట్టిగా తన్నమని చెప్పడంతో తాను అట్లా గట్టిగా తన్నాను అని చెప్పడంతో విషయం తెలుసుకున్న పోసాని దర్శకుడు సంతోష్ పై తిట్ల పురాణం పోసాని విప్పాడని నిఖిల్ అప్పటి విషయాలను గుర్తుకు చేసుకున్నాడు. అయితే తెలుగు ఏమాత్రం రాని దర్శకుడు సంతోష్ కు ఆ తిట్లు అర్ధం తెలియక పోవడంతో తనను దర్శకుడు అడిగినా పోసాని బూతుల పురాణంలోని అర్ధాలు అతడికి వివరించ లేదనీ అసలు నిజాలు చెప్పి ఉంటే చాల సమస్యలు వచ్చి ఉండేవి అంటూ నిఖిల్ జోక్ చేసాడు. ఇంత హడావిడి చేసిన ఆ సీన్ ఎడిటింగ్ లో లేపెసారు అంటూ నిఖిల్ చెప్పిన విషయాలు పోసాని విశ్వరూపాన్ని సూచిస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: