సినిమా రంగం చిత్రమైనది. ఆ రంగంలో ఉన్నన్ని సెంటిమెంట్లు మరే రంగంలో లేవు. ఒక సినిమా హిట్ అయితే అదే మూసతో మరిన్ని సినిమాలు తీస్తారు. అదే విధంగా సినిమా టైటిల్ ఒకటి సక్సెస్ అయితే అదే అక్షరంతో పదుల సంఖ్యలో సినిమాలు వస్తాయి. నిజంగా ఒక సినిమా హిట్ అయ్యిందంటే అందులో ఏదో విషయం ఉందని అనుకోరు. ఇవన్నీ ఎందుకంటే.

 

మనకు రోజారమణి అని అద్భుతమైన నటీమణి ఉంది. పాతతరం వారికి ఆమె బాగా తెలుసు. ఇప్పటితరం వారికి ఆమె యువ‌ నటుడు తరుణ్ మదర్ గా తెలుసు. ఇదిలా ఉండగా రోజారమణి బహుముఖ ప్రతిభాశాలి. ఆమె బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి ఆ తరువాత నటిగా క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించారు. ఇక ఎంతో మంది అందమైన హీరోయిన్లకు ఆమె అద్భుతంగా డబ్బింగ్ చెప్పి వారి కెరీర్ నిలబెట్టారు. 

 

రోజారమణి టాలెంటెడ్ ఆర్టిస్ట్ అయినా ఆమెకు అనుకున్నంతలా అవకాశాలు మాత్రం రాలేదు. 1973లో వచ్చిన కన్నె వయసు మూవీ అప్పట్లో సూపర్ డూపర్ హిట్. ఈ మూవీలో రోజారమణి యవ్వనప్రాయం ఉన్న ఒక అమాయక కధానాయిక పాత్ర పోషించి సినిమాకు ప్రాణం పోశారు. ఇక అప్పట్లో హీరోయిన్ల సగటు వయసు ముప్పయ్యేళ్ళు.  ఆ టైంలో రోజారమణి కేవలం పదిహేనేళ్ళ లోపు ప్రాయంలోనే  హీరోయిన్ గా రావడం గొప్ప విప్లవమే.

 

ఇక రోజారమణికి హీరోయిన్ గా తెలుగులో అనుకున్న గుర్తింపు అవకాశాలు రాలేదు కానీ మిగిలిన భాషల్లో ఆమె రాణించారు. దాసరి నారాయణరావు అప్పట్లో  తీసిన భారతంలో ఒక అమ్మాయి లేడీ ఓరియెంటెడ్ మూవీలో ఆమె నటించి సత్తా చాటుకుంది. ఎక్కువగా చెల్లెలు పాత్రలే ఆమెను వరించాయి. ఇక  కమల్ హాసన్ తో జంటగా సొమ్మొకడిది, సోకొకడిది మూవీలో ఆమె నటించారు. 

 

కెరీర్ బాగా సాగుతుండగానే ఒడిషా నటుడు చక్రపాణితో లవ్ లో పడి పెళ్ళి చేసుకున్నారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా రోజారమణి పెళ్ళి తరువాత రికార్డు స్రుష్టించారు. ఇదిలా ఉండగా రోజారమణి నటించిన కన్నె వయసు 50 ఏళ్ళు అయిన సందర్భంగా విశాఖలో జరిగిన ఒక సత్కార కార్యక్రమంలో ఆమెను పిలిచి సన్మానించారు. ఈ సందర్భంగా రోజారమణి మాట్లాడుతూ తనకు ఎన్ని సినిమాలు వేసినా బాలనటిగా నటించిన భక్త ప్రహ్లాద తెచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు అన్నారు. ఆ మూవీ ప్రభావంతో ఎక్కడికి వెళ్ళినా ప్రహ్లాదుడనే పిలుస్తారని చెప్పుకుంది.

 

 విశాఖలోని సింహాచలంలో ఉన్న వరాహనరసింహస్వామి ఆలయంలోని ప్రహ్లాదుడి విగ్రహానికి వెండి కిరీటాన్ని తయారు చేయించి ఆమె బహూకరణ చేశారు. మొత్తానికి ఒక పాత్ర ప్రభావం జీవిత కాలం వెంటాడుతుందనడానికి రోజారమణి ఒక ఉదాహరణ.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: