సాధారణంగా సినీ హీరోయిన్ల అందాలను ఇష్టపడని వాళ్ళు ఉండరేమో . హీరోయిన్‌ని అయినా కాకపోతిని అనుకోని చాలా మంది అమ్మాయిలూ అనుకోకపోరు. ఫలానా హీరోయిన్‌ని పెళ్లి చేసుకోవాలని కోరుకునే అబ్బాయిలు ఎందరో ఉంటారు.అది కుదరక చాలా మంది సర్దుకు పోతుంటారు కూడా. ఇలాంటి ఆలోచన ఉన్న ఓ అబ్బాయే ఓ బాలీవుడ్‌ హీరోయిన్‌కి ప్రపోజ్ చేశాడు. ఆమె ఎవరో కాదు భూమి పెడ్నేకర్. విభిన్నమైన కాన్సె్ప్ట్స్ ఎంచుకుంటూ ప్రేక్షకుల మనసులు దోచుకున్న భూమికి ఫ్యాన్స్ ఎక్కువే. ఈ నేపథ్యంలో కఫీర్ సౌరభ్ అనే నెటిజన్.. భూమికి ప్రపోజ్ చేశాడు.

 

ఇది ఇలా ఉండగా ‘హాయ్ బ్యూటిఫుల్ మ్యామ్. మీ ఫొటో చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేను. మీరు చాలా ముద్దుగా ఉంటారు. మీరు సాధారణ అమ్మాయి అయితే బాగుండేది. కానీ ఇప్పుడు మీరు పెద్ద సెలబ్రిటీ. మిమ్మల్ని నేను ఎంత ప్రేమించినా లాభం లేదు. ఎందుకంటే మీరు నాలాంటి సాధారణ వ్యక్తిని పెళ్లి చేసుకోలేరుకదా. ఈ విషయం తలుచుకున్నప్పుడల్లా నాకు బాధగా ఉంటుంది’ అని ట్వీట్ చేశారు. 

 


తాజాగా ఈ ట్వీట్ కి స్పందించిన భూమి ఇచ్చిన రిప్లై ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఎంత సెలెబ్రెటీ అయినా కూడా నేను ఒక అమ్మాయినే అంటూ ట్వీట్ చేసింది. అంతేకాకుండా తనకు ఇప్పటిలో పెళ్లిచేసుకొనే ఆలోచన కూడా లేదని  అంది. సినిమాలలో అందరిని అలరించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను అంటూ ఆమె వెల్లడించారు. మీకోసం నేను ఎప్పుడు సినిమాలను తెరకెక్కిస్తూనే ఉంటాను అంటూ భూమి అన్న మాటలు అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. 

 


అభిమానులకు ఆమె ఇచ్చిన కూల్ సమాధానం కు అందరు ఆమెకు ఫిదా అయ్యారు. ఇకపోతే ఈ అమందు సినిమాలలోని మోడల్ షో లలో తళుక్ మంటూ బిజీగా ఉంది. చాలా సినిమాలూ నటిస్తూ వస్తున్నది. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు తాజా ఫోటోలను షేర్ చేస్తూ బిజీగా ఉంటుంది. అభిమానుల నుండి లైక్స్ , షేర్స్, కామెంట్స్ అందుకుంటుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: