పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయాలని అనేకమంది దర్శకులు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తుంటే పవన్ కళ్యాణ్ కు మరో విధంగా దర్శకుల కొరత ఏర్పడటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. పవన్ తన సినిమాల రీ ఎంట్రీ విషయాన్ని పక్కకు పెట్టి తన సొంత నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ ఆర్ట్స్ బ్యానర్ పై చిన్న సినిమాలు మీడియం రేంజ్ సినిమాలు తీయాలని చాల గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.

ముఖ్యంగా సాయి తేజ్ వరుణ్ తేజ్ లను హీరోలుగా పెట్టి కనీసం ఏడాదికి రెండు సినిమాలు సొంత బ్యానర్ పై తీయాలని ప్రయత్నాలు చేస్తున్నా ఆ ప్రయత్నాలు ఒక్క అడుగు కూడ ముందుకు పడటం లేదు అని టాక్. దీనికి కారణం పవన్ కు చాల కొద్ది మంది దర్శకులతో మాత్రమే సాన్నిహిత్యం ఉండటం ఒక కారణం అని అంటున్నారు.

ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తప్ప పవన్ కు ఏ దర్శకుడుతోను సాన్నిహిత్యం లేదు. దీనికితోడు కొంతమంది యంగ్ డైరెక్టర్ లు పవన్ ను వ్యక్తిగతంగా కలిసి తమ కథలు చెప్పాలని ప్రయత్నించినా వారికి పవన్ తో ఎపాయింట్ మెంట్ దొరకడమే కష్టంగా ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. 

ఇలాంటి పరిస్థితులలో పవన్ సినిమా రీ ఎంట్రీకి సంబంధించి మాత్రమే కాకుండా పవన్ నిర్మాతగా మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు కూడ చాల అడ్డంకులు ఏర్పడుతున్నాయి. పేరుకు మెగా ఫ్యామిలీలో ఒక క్రికెట్ టీమ్ కు సరిపోయే సంఖ్యలో హీరోలు ఉన్నా వారందరూ పవన్ కు డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా పవర్ స్టార్ కు ఏర్పడిన దర్శకుల కొరతతో ఒక అయోమయం ఏర్పడి కన్ఫ్యూజన్ లో పవన్ నిర్మాతగా ఆలోచిస్తున్న ప్లాన్స్ కూడ ఒక అడుగు ముందుకు పడితే రెండు అడుగులు వెనక్కి పడుతున్నాయి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: