‘భరత్ అనే ను’ మూవీ విడుదలై దాదాపు ఏడాదిన్నర కావస్తున్నా కొరటాల ఇప్పటికీ బిజీ కాలేకపోతున్నాడు. చిరంజీవితో తన మూవీని తీయాలి అని కొరటాల చేసిన ఆలోచన ఇప్పుడు అతనికి శాపంగా మారిందా అంటూ ఇండస్ట్రీలో కొందరు ఈటాప్ డైరెక్టర్ పై సానుభూతి చూపెడుతున్నారు. వాస్తవానికి కొరటాల చిరంజీవిల కాంబినేషన్ మూవీ షూటింగ్ ఈ ఏడాది సమ్మర్ లో ప్రారంభం కావలసి ఉంది. 

అయితే ‘సైరా’ పనుల ఒత్తిడితో ఈ మూవీ షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ‘సైరా’ విడుదల అయిన తరువాత చిరంజీవి కొరటాల మూవీ ప్రారంభం కావడంతో ఈ మూవీ షూటింగ్ నవంబర్ నుండి కొనసాగుతుంది అని అనుకున్నారు అంతా. అయితే నవంబర్ గడిచిపోయి డిసెంబర్ వచ్చేస్తున్నా ఈ మూవీ షూటింగ్ డిసెంబర్ లో కూడ ప్రారంభం అయ్యే ఆస్కారం లేదు అంటూ లీకులు వస్తున్నాయి. 

దీనికి కారణం ఈ మూవీలో చిరంజీవి తన పాత్ర రీత్యా కొద్దిగా సన్నగా కనపడాలి. అయితే ‘సైరా’ కోసం పెంచిన శరీరాన్ని నెమ్మదిగా తగ్గించాలి కాని ఒకేసారి ఎక్కువ శారీరక శ్రమ చేసి అదేవిధంగా విపరీతమైన డైటింగ్ చేసి శరీరంలో మార్పులు తీసుకు రావద్దు అంటూ చిరంజీవికి అతడి వ్యక్తిగత డాక్టర్లు సూచించినట్లు టాక్. దీనితో ఈ మూవీకి సంబంధించి చిరంజీవి కొరటాల కోరుకున్న విధంగా తయారుకావడానికి మరొక రెండు నెలలు పట్టే ఆస్కారం ఉంది అని అంటున్నారు. 

ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీ షూటింగ్ జనవరి చివరకు ప్రారంభం అయితే గొప్ప అని అంటున్నారు. దీనితో ఈ మూవీని వేగంగా పూర్తి చేయాలి అని కలలు కంటున్నా కొరటాల ప్లాన్స్ కు బ్రేక్ పడి ఈ మూవీ వచ్చే ఏడాది ఆగష్టుకు విడుదలైతే చాల గొప్ప అన్న మాటలు వస్తున్నాయి. దీనితో టాప్ డైరెక్టర్ స్థాయిలో కొనసాగుతూ విలువైన రెండు సంవత్సరాలు వృథా అయినందుకు కొరటాల బయటకు చెప్పుకోలేక ధైర్యంగా చిరంజీవి దగ్గర అసహనం వ్యక్త పరచలేక ఒక అయోమయ స్థితిలో ఉన్నాడు అంటూ ఇండస్ట్రీలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: