నాని హీరోగా శ్రధ్దాకపూరు హీరోయిన్ గా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "జెర్సీ". ఈ సినిమాలో నాని క్రికెటర్ గా కనిపించాడు.  ఈ సినిమా కోసం నాని కొన్ని రోజుల పాటు క్రికెట్ కూడా నేర్చుకున్నాడు. సినిమాలో ఒక ప్రొషెషనల్ ఆటగాడికి ఏమాత్రం తగ్గకుండా అతని హావభావాలు కనిపించాయి. ఫుల్ అండ్ ఫుల్ ఎమోషనల్ గా సాగే ఈ సినిమా నానికి మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమా వల్ల నాని కథల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడో అర్థం అవుతుంది. 

 

అలాగే నానికి కథల విషయంలో మంచి జడ్జ్ మెంట్ ఉందనే విషయం తెలుస్తుంది. అయితే ఈ సినిమా ప్రస్తుతమ్ హిందీలో రీమేక్ అవనుంది. షాహిద్ కపూర్  హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా బాలీవుడ్ లో ఈ సినిమా తెరకెక్కనుండి. తెలుగు జెర్సీ సినిమాకి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి ఈ బాలీవుడ్ సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే హిందీ జెర్సీలో కొన్ని మార్పులు చేయనున్నారట.


 
ముఖ్యంగా కొడుకు పాత్రను కొత్తగా రాసినట్లు తెలుస్తోంది. తండ్రి పాత్ర మధ్యలో ఆపేసిన క్రికెట్ జర్నీని, కొడుకు పాత్ర కంటిన్యూ చేస్తోందట. డిసెంబరు నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందట.  షాహిద్ కపూర్ ఇంతకుముందే తెలుగు చిత్రం ‘అర్జున్ రెడ్డి’ని హిందీలోకి ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి భారీ హిట్ అందుకొన్నారు. ఇప్పుడు కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతూ చేస్తున్న ఈ సినిమా మీద హిందీ ప్రేక్షకుల్లో అమితాసక్తి నెలకొని ఉంది.

 

హిందీ జెర్సీని ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు నిర్మిస్తుండగా వీరిద్దరితో పాటు బాలీవుడ్ నిర్మాత ఆమన్ గిల్ నిర్మాణంలో భాగస్వామం తీసుకున్నారు. మరి ఈ సినిమా కూడా కబీర్ సింగ్ లాగా విజయం సాధిస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: