సినిమాల్లో వచ్చే కొన్ని కొన్ని పాత్రలు ఎంత కాలమైనా మనసుల్లో నిలిచిపోతాయి. సినిమా షూటింగ్‌కు ముందు ఆ కధ చెప్పినప్పుడు అందులోని పాత్రకు మిమ్ములను తీసుకోవాలని అనుకుంటున్నామని నటీమణులను కలిసి చెబితే అంతగా పట్టించుకోరు. కాని అది విడుదలై ఆ పాత్రకు మంచి పేరు వస్తే మాత్రం అప్పుడు ముందుకు వచ్చి ఆ పాత్ర వదులుకున్నందుకు తెగ ఫీల్ అవుతారు. ఇప్పుడు నటి లయ కూడా ఇలాగే చెబుతుంది.

 

 

ఫ్యాక్షన్‌ నేపథ్యంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా తివిక్రమ్‌ తెరకెక్కించిన చిత్రం ‘అరవింద సమేత’. ఈ చిత్రంలోని ప్రతి పాత్రకు ప్రేక్షకులు పట్టం కట్టారు. ముఖ్యంగా బసిరెడ్డి గా నటించిన జగపతి బాబు, భార్య పాత్ర చాలా కీలకమైంది. ఆ పాత్రలో కనిపించిన ఈశ్వరీరావు. కన్న కొడుకు (నవీన్‌ చంద్ర) ను, కట్టుకున్న భర్త (జగపతిబాబు) కళ్ల ముందే చంపినప్పుడు.. ఆ హృదయవిదారక సన్నివేశంలో జీవించి అందరితో కంటతడి పెట్టించింది. అంతగా ఆ పాత్రలో ఆమె ఒదిగిపోయింది..

 

 

అయితే ఆ పాత్ర కోసం ముందుగా త్రివిక్రమ్‌ లయను సంప్రదించారట. కానీ అప్పటికే లయ వివాహం చేసుకుని చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంది. ఇదే కాకుండా మళ్లీ వెండితెరపై కనిపించాలనే కోరిక ఉన్నా.. అమ్మ, వదిన లాంటి పాత్రలు చేసేందుకు ఇష్టపడక, తనకు కాస్త సమయం పడుతుందని చెప్పిందట. దీంతో త్రివిక్రమ్‌ ఆ పాత్రకు ఈశ్వరీరావును ఎంపిక చేశారు.

 

 

ఇకపోతే ఈ విషయంలో కాస్త ఫీలవుతూ ‘తారక్‌ నటన నాకు చాలా ఇష్టం. ఆయనతో నటించే అవకాశం వచ్చినా చేయ లేకపోతున్నాను. భవిష్యత్తులో కనుక మంచిపాత్ర అతనితో దొరికితే మాత్రం తప్పక చేస్తాను అని ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను లయ పంచుకున్నారు. ఇకపోతే స్వయంవరం సినిమాతో తెలుగు చిత్రప్రశ్రమకి పరిచయం అయిన లయ..

 

 

ఫ్యామిలీ సినిమాలు చేసుకుంటూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాను చేసిన ప్రతి సినిమాలో చాలా హోమ్లీ గా కనిపించేది ఈ నటి.. ఇక గణేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని హీరోయిన్ గా సినిమాలు చేయడం మానేసిన లయ చివరగా రవితేజ నటించిన ఆమర్ అక్బర్ అంథోని సినిమాలో ఓ గెస్ట్ రోల్ లో కనిపించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: