ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషి కపూర్ కొత్తగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న యువ నటులకు ఒక సలహా ఇచ్చారు. ఒక ఇంటర్వ్యూలో రిషి కపూర్ మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే యువ నటులు కండలు పెంచి సినిమా ఇండస్ట్రీలోకి వస్తున్నారని కానీ యువ నటులు బుర్రలు పెంచాలని కండలు పెంచాల్సిన అవసరం లేదని రిషి కపూర్ చెప్పారు. సినిమా ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగుపెడుతున్న నటులు బాడీ బిల్డింగ్ పై ఎక్కువగా శ్రద్ధ చూపుతున్నారని బాడీ ఉంటే మాత్రమే అవకాశాలు వస్తాయని అనుకుంటున్నారని రిషి కపూర్ అన్నారు. 
 
నటులకు బాడీ కంటే ఎమోషనల్ వ్యాయామం అవసరమని నటులు బుర్రలు పెంచుకుంటే నటించే నైపుణ్యాలు పెరుగుతాయని, మంచి కథలను ఎంపిక చేసుకోగలుగుతారని అలాంటివేమీ లేకపోతే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కాలేరని రిషి కపూర్ అన్నారు. నాకు సిక్స్ ప్యాక్ బాడీ లేదని అయినా ఇప్పటికీ నేను నటిస్తున్నానని నాకు వయసైపోయిందని యంగ్ స్టర్స్ కు నేను రోల్ మోడల్ కాదని రిషి కపూర్ అన్నారు. 
 
రణబీర్ కపూర్, విక్కీ కౌశల్, రణవీర్ సింగ్, రాజ్ కుమార్ రావు, ఆయుష్మాన్ ఖురానా వీరెవ్వరికీ భారీ శరీరాకృతులు లేవని జిమ్ కు వెళ్లి డబ్బులు ఖర్చు చేయటం వలన డబ్బులు పోవడం తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదని రిషి కపూర్ అన్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సినిమాల్లోకి అడుగుపెట్టిన సమయంలో సన్నగా ఉన్నారని ఇప్పుడు కూడా అమితాబ్ బచ్చన్ సన్నగానే ఉన్నారని రిషి కపూర్ అన్నారు. 
 
తాను క్యాన్సర్ చికిత్స కొరకు అమెరికాలో ఉన్న సమయంలో అక్కడి ఆడియన్స్ తన సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారనే విషయం తెలిసి షాక్ అయ్యానని రిషి కపూర్ అన్నారు. నా సినిమాలు ఇంటర్నేషనల్ ఆడియన్స్ చూసి ఎంజాయ్ చేస్తున్నారని తెలిసిన సమయంలో నేను నటించిన పది సినిమాలు చూడమని చెప్పానని రిషి కపూర్ చెప్పారు. సినిమా అనేది వేలాదిమంది మనసులను కదిలించగలదని రిషి కపూర్ అన్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: