ప్రస్తుతం తెలుగు లో వరుసగా బపయోపిక్ మూవీస్ వస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో మహానటి, ఎన్టీఆర్ బయోపిక్, యాత్ర మరికొన్ని బయోపిక్ మూవీస్ వస్తున్నాయి.   ఈ నేపథ్యంలో 1967లో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యామాలకు బీజం వేసిన జార్జి రెడ్డి జీవిత కథ ఆధారంగా జీవన్‌ రెడ్డి దర్శకత్వంలో సందీప్‌ మాధవ్‌ హీరోగా ‘జార్జిరెడ్డి’ మూవీ తెరకెక్కించారు.  ఇప్పటికే తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ‘సైరా నరసింహారెడ్డి’ మూవీ విజయం సాధించింది. ప్రస్తుతం ఆదే కోవలో దశాబ్ధాల క్రితం విద్యార్థి విప్లవోద్యమ నాయకుడుగా చరిత్రలో నిలిచిపోయి ఆ తర్వాత మరిచిపోయిన వీరుడి కథ ఆధారంగా తెరకెక్కించిన మూవీ ‘జార్జిరెడ్డి’.  

 

తాజాగా రియల్ లైఫ్ లో జార్జిరెడ్డి స్నేహితుడు ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో దర్శక, నిర్మాతగా వ్యవహరిస్తున్న తమ్మారెడ్డి భరద్వాజ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.    'జార్జి రెడ్డి' తమ్ముడు సిరిల్ రెడ్డి వివాహం గీతారామస్వామితో జరిగింది. 'జార్జి రెడ్డి'ని గురించిన పుస్తకాన్ని ఆమే రాశారు. కేరళలో 'జార్జి రెడ్డి' బాల్యానికి సంబంధించిన విషయాలను కూడా ఆమె ఆ పుస్తకంలో ప్రస్తావించారు. జార్జి రెడ్డి పేరును .. ఆయనకి గల కొన్ని లక్షణాలను .. ఉస్మానియా విశ్వవిద్యాలయం నేపథ్యాన్ని..  ఆయన అక్కడ చదివిన కాలాన్ని తీసుకుని కొన్ని కల్పిత సంఘటనలతో ‘జార్జిరెడ్డి ’ సినిమా చక్కగా తీశారన్ని అన్నారు.

 

జార్జి రెడ్డి గురించి అందరికీ తెలియాల్సిన అవసరం వుంది .. నిజంగానే ఆయన హీరో. విప్లవ భావాలు కలిగిన కుర్రాళ్లకు ఆయన గొప్ప ఆదర్శమూర్తి. మా కాలేజ్ కి వచ్చినప్పుడు నేను కూడా వాళ్లతో ఉండేవాడిని. జార్జి రెడ్డి ఎప్పుడూ బ్లేడ్లు .. కత్తులు పట్టుకుని తిరగలేదు. సమస్య వస్తే ఒక్కడే వెళ్లిపోయేవాడు. ఒక్కడే పది పదిహేను మంది దాడి చేసినా సమాధానం చెప్పి చిత్తు చేసేవాడు. స్వతహాగా ఆయన మంచి బాక్సర్, మార్షల్ ఆర్టిస్ట్ అని అన్నారు. సిరిల్ కి బాక్సింగ్ లో ప్రవేశం వుంది .. అతను కూడా మంచి ఫైటర్. అన్నదమ్ములు ఇద్దరూ కలిసి ఉండగా ఎవరూ ఏమీ చేయలేరు అన్నట్టుగా ఉండేవారు అని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: