బిగ్ బ్రదర్ నుండి దిగుమతి అయిన బిగ్ బాస్ ఇండియాలో మొదటగా హిందీలో స్టార్ట్ అయింది. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించే ఈ షో ఇప్పటికీ పన్నెండు సీజన్లు పూరి చేసుకుని పదమూడవ సీజన్లోకి ఎంటర్ అయింది. ఈ షో హిందీలోనే కాదు ప్రాంతీయ భాషల్లో కూడా రావడం మొదలయింది. తెలుగు, తమిళ భాషల్లో మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. అయితే ఈ షో ద్వారా కంటెస్టెంట్లకి చాలా పాపులారిటీ వస్తుంది.

 

అలా పాపులారిటీ సాధించిన వారు చాలా ఉన్నారు. అయితే ఆ పాపులారిటీ వారి కెరియర్ కి ఎలా ఉపయోగపడిందనేది చూస్తే, పెద్దగా ఉపయోగపడలేదనే చెప్పాలి. బిగ్ బాస్ ద్వారా పాపులర్ అవడమే కాదు, దాని ద్వారా వివాదాలు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి కోవలోకి చెందిన నటి ఒవియా. కలవాని చిత్రంతో కోలీవుడ్‌కు రంగప్రవేశం చేసిన ఈ భామకి ఆ చిత్రం విజయవంతం కావడంతో అవకాశాలు వరుసకట్టాయి. 

 

అయితే అవకాశాలు వచ్చినప్పటికీ సక్సెస్ మాత్రం కాలేదు.  ఆమె చేసిన చిత్రాలలో చాలా తక్కువ చిత్రాలే సక్సెస్‌ కావడంతో ఓవియ మార్కెట్‌ ఒక్క సారిగా పడిపోయిందిద. దాంతో అవకాశాలు సన్నగిల్లిపోయాయి. అప్పుడే ఆమెకి బిగ్ బాస్ అవకాశం వచ్చింది. బిగ్‌బాస్‌ హౌస్‌లో సహ నటుడు ఆరవ్‌తో ప్రేమాయణం, అది బెడిసి కొట్టడం, ఆత్మహత్యాయత్నం వంటి సంఘటనలు ఓవియను సంచలన నటిగా మార్చేశాయి. 

 

కానీ ఆ తర్వాత వచ్చిన సినిమా 90 ఎమ్ ఎల్ తనకి చెడ్డ పేరును తెచ్చి పెట్టింది. ప్రస్తుతం ఆమెకి పెద్దగా అవకాశాలు లేవు. అయితే ఒకానొక ఇంటర్వ్యూలో ఆమెను రాజకీయాల గురించి ప్రశ్న అడగగా, తనకి కోపం వచ్చిందట. దానితో రాజకీయాలతో సంబంధం లేని వారికి రాజకీయాల గురించి ప్రశ్నలడగడం కరెక్ట్ కాదని వాదించింది. అయితే ఒకానొక నెటిజన్ మీరు రాజకీయాల్లో చేరతారా అని అడగగా నాకూ ఒక ఆర్మీ ఉందని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: