తెలుగు సినిమాల విడుదలకు ముఖ్యమైన సీజన్ అయిన సంక్రాంతి పండుగ మరో యాభై రోజుల్లో రానుంది. ఇప్పటికే పండుగకు వచ్చే సినిమాలు ఫిక్స్ అయిపోయాయి. సరిలేరు నీకెవ్వరుతో మహేశ్, అల వైకుంఠపురంతో అల్లు అర్జున్, దర్బార్ తో రజినీకాంత్, ఎంత మంచివాడవురా తో కల్యాణ్ రామ్.. తమ సినిమాలతో సిద్ధమయ్యారు. పండుగ సినిమాల కోసం ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ నాలుగు సినిమాల్లో బజ్ క్రియేట్ చేసిన సినిమాలు కొన్ని.. ఏమాత్రం బజ్ క్రియేట్ చేయని సినిమాలు కూడా ఉన్నాయి.

 

 

ఈ లిస్టులో బన్నీ నటించిన అల.. వైకుంఠపురంలో సినిమా ఫస్ట్ ప్లేస్ లో ఉంటే.. కల్యాణ్ రామ్ నటించిన ఎంత మంచి వాడవురా మాత్రం లాస్ట్ ప్లేస్ లో ఉంది. ఈ సినిమాపై ఇప్పటివరకూ టీమ్ ఎటువంటి క్యూరియాసిటీ క్రియేట్ చేయలేకపోయింది. ఫస్ట్ లుక్, చిన్న టీజర్ మాత్రం రిలీజ్ చేశారు. వీటితో ఈ సినిమాపై ఎటువంటి క్యూరియాసిటీ క్రియేట్ కాలేదు. పరిశ్రమలో కానీ, ప్రేక్షకుల్లో కానీ, సోషల్ మీడియాలో కానీ.. బన్నీ, మహేశ్ సినిమాలపై ఉన్న క్యూరియాసిటీ కల్యాణ్ రామ్ సినిమాపై ఏమాత్రం లేదు. ఒకవేళ టీజర్ ను విడుదల చేసినా వీరి సినిమాల ముందు ఏమాత్రం నిలబడుతుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రజినీకాంత్ దర్బార్ డబ్బింగ్ మూవీ కావడంతో ఆ సినిమా గురించి పెద్ద ఇంపాక్ట్ లేదు.

 

 

మరి కల్యాణ్ రామ్ ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నాడో అర్ధం కాని పరిస్థితి. ఈ సినిమాను జనవరి 15న విడుదల చేస్తామని యూనిట్ ఇదివరకే ప్రకటించారు. అందుకు తగ్గట్టు సినిమాపై అంచనాలు పెంచే విధంగా ప్రమోషన్స్ ఏమాత్రం మొదలుపెట్టలేదు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులకు చేరువ కాలేదు. ఇప్పటికైనా ఈ విషయంలో ముందడుగు వేస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: