దేవిశ్రీ ప్రసాద్ హవా మసక బారడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా తమన్ హడావిడి కనిపిస్తోంది. దీనికితోడు ఇతడు స్వరపరిచిన ‘అల వైకుంఠపురములో’ మూవీకి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పాటలు అన్నీ సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు తమన్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు. అయితే తమన్ కొన్ని సినిమాలకు మాత్రమే మంచి మ్యూజిక్ ఇస్తాడు తప్ప అన్ని సినిమాలకు తమన్ సమన్యాయం చేయడా అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఇప్పుడు చర్చలు మొదలవుతున్నాయి. 

ఇలాంటి కామెంట్స్ రావడానికి ఒక ఆసక్తికర కారణం కనిపిస్తోంది. డిసెంబర్ రేసుకు రాబోతున్న సాయి తేజ్ ‘ప్రతిరోజు పండగే’ వెంకటేష్ చైతన్యాల ‘వెంకీ మామ’ మూవీలకు కూడ తమన్ మ్యూజిక్ అందించాడు. అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పాటల స్థాయి బాగుండకపోవడంతో తమన్ కొన్ని సినిమాలకు మాత్రమే మంచి మ్యూజిక్ ఇచ్చి మిగతా సినిమాల గురించి పట్టించుకోడా అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. 

మరికొందరైతే తమన్ తనకు భారీభారీ పారితోషికం వచ్చే టాప్ హీరోల సినిమాల పట్ల చూపించే శ్రద్ధ తమన్ మిడిల్ రేంజ్ చిన్న సినిమాల పట్ల చూపించడా అంటూ జోక్ చేస్తున్నారు. అయితే తమన్ ఇలా ప్రవర్తించడానికి మరొక కారణం ఉంది అంటూ మరికొందరి అభిప్రాయం. ఒక సంగీత దర్శకుడు ఇచ్చే ట్యూన్స్ ఆ మూవీ దర్శకుడు తాను తీయబోయే పాటలోని సన్నివేశాల గురించి ఉద్వేగంగా చెప్పినప్పుడు మాత్రమే మంచి ట్యూన్స్ వస్తాయని లేకుంటే రొటీన్ ట్యూన్స్ మాత్రమే మిగిలిపోతాయి అంటూ తమన్ ను సపోర్ట్ చేసే కొందరు వాదిస్తున్నారు. 

దీనితో త్రివిక్రమ్ ‘అల వైకుంఠపురంలో’ సీన్స్ గురించి బాగా చెప్పినందువల్ల తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు కాని లేకుంటే తమన్ లో క్రియేటివిటీ తగ్గిపోయింది అన్న అభిప్రాయం కలుగుతుంది. అయితే ప్రస్తుతం చాలామంది దర్శకులు హీరోలకు మూవీ బడ్జెట్ కు ఇస్తున్న ప్రాధాన్యత సినిమాలోని పాటల ట్యూన్స్ కు సాహిత్యానికి ఇవ్వని పరిస్థితులలో అన్ని తప్పులకు తమన్ కారకుడు అంటూ ఒక నిర్ణయానికి రావడం మంచిదికాదు అంటూ మరి కొందరి భావన..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: