ఏయ్ నేను హీరోని నువ్వు నన్ను టచ్ చేస్తావా? అరేయ్ ఏంట్రా ఈ అలగా జనాన్ని ఇంత దగ్గరకు రానిస్తున్నావ్? అనే మాటలు మనం సినిమా ఇండస్ట్రీలో తరచుగా వింటూనే ఉంటాం. ఇక పైకి నవ్వుతూనే షేక్ హ్యాండ్స్ ఇస్తూ చాటుకెళ్లి డెటాల్ సోప్‌తో చేతులను క్లీన్ చేసుకునే హీరోలను చూసే ఉంటాం. ఇకపోతే స్టేజీ పైకెక్కి అభిమానులతో గాల్లోకి చేతులూపుతూ ఫ్లైయింగ్ కిస్స్ ఇస్తూ హంగామా చేసే వారు పర్సనల్‌గా వెళ్లి కలిస్తే చిదిరించు కుంటారు ఇలాంటి హీరోలు కూడా ఉన్నారు.

 

 

కాని నిజమైన అభిమానం అంటే ఏంటో ఒక హీరో చూపించాడు. అతనే కార్తి. నిజంగా ఇతను చేసిన పని తెలిస్తే హ్యట్సాఫ్ చెప్పకుండా ఉండలేరు. అదేమంటే చెన్నైకు చెందిన వ్యసాయ్ నిత్య అనే అభిమాని ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని వెంటనే దగ్గర్లోని హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం అతను చనిపోయాడు. ఈ విషయం తెలీడంతో కార్తి హుటాహుటిన అభిమాని స్వస్థలమైన ఉళుండూరుపేటకు బయలుదేరి వెళ్లి అక్కడ ఆ అభిమాని మృతదేహాన్ని చూసి ఉద్వేగానికి లోనవుతూ, కన్నీరు పెట్టుకున్నారు.

 

 

అంతే కాకుండా వ్యసాయ్ కుటుంబీకులను పరామర్శించి. ఏ సాయం కావాలన్నా తాను ఎల్లప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు. ఇక ఉళుండూరుపేట నుంచి కార్తి నేరుగా తాను నటించిన ‘తంబి’ సినిమా ఆడియో లాంచ్‌‌కు వెళ్లారు.. నిజంగా మనసున్న మంచి హీరో అనిపించారు కార్తీ. తెరపైన ఎంతగానో ప్రేమలు ఒలకబోసి నిజజీవితంలో అభిమానులంటే చీమల్లా చూసే వారి దృష్టిలో ఈ సంఘటన ఒక చెంప పెట్టు లాంటింది..

 

 

అసలు అభిమానులు ఉన్నారు కాబట్టే సినిమా రంగం అభివృద్ధి పధంలో నడుస్తుంది. అందరు సినిమాలను చూడటం ఆపేస్తే అప్పుడు పరిస్దితి ఏంటి. అందుకే అందరు మానవత్వంతో సమానత్వాన్ని ఆపాదించుకుని ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటే వారి జీవితాలకు అర్ధం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: