విలక్షణ  దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్‌ సెటైరికల్‌ మూవీ 'అమ్మ రాజ్యంలో కపడ బిడ్డలు'. మొదటగా  ఈ సినిమాకు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే టైటిల్‌ పెట్టినా సెన్సార్‌ ఇబ్బందులు తలెత్తుతాయన్న ఉద్దేశంతో టైటిల్‌ను మార్చాడు వర్మ. అయితే టైటిల్‌ మార్చినా వర్మ సినిమాకు ఇబ్బందులు మాత్రం తప్పలేదు.


వర్మ తెరకెక్కించిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా టైటిల్ ఎనౌన్స్‌మెంట్‌ దగ్గర నుంచి వివాదాలకు కేంద్ర బింధువుగా మారింది. ఈ సినిమా టైటిల్‌ రెండు కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఉందని హైకోర్టులో పిటీషన్‌ దాఖలైంది. అదే సమయంలో సినిమాలో వర్మ ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తులను అవమానించాడన్న విమర్శలు కూడా వినిపించాయి. ఇదే విషయమై కేఏ పాల్‌ కేసు వేశాడు. అయితే పిటిషన్లను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం సినిమా రిలీజ్‌పై స్టేజ్‌ విధించింది. సెన్సార్ బోర్డ్‌కు సినిమాపై వస్తున్న విమర్శలు, వివాదాల నేపథ్యంలో కొన్ని సూచనలు చేసింది.

 

మామూలు క్రైమ్‌ కన్నా.. పొలిటికల్‌ క్రైమ్‌ మరింత ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది అందుకనే ఈ మధ్య ఆ తరహా సినిమాలు నాకు ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తున్నాయి. ఈ సినిమాలో కథ టైమ్‌ పీరియడ్‌కు సంబంధించి ముందే ఓ లైన్‌ వస్తుంది. 'మే 2019 నుండి సెప్టెంబర్ 2020 వరకూ జరిగిన ఘటనల ఆధారంగా' అని. జరిగిన, జరుగుతున్న ఇన్సిడెంట్స్‌ ఆధారంగా జరగబోయే అంశాలను ఊహించి చెప్పిన సినిమా ఇది. కేవలం ఓ సెటైర్‌గానే సినిమాను భావించాలి` అన్నాడు వర్మ. 


సెన్సార్ బోర్డు నిర్వాహకం కూడా ఎవరికీ అంతు చిక్కకుండా ఉంది అందుకే ఈ సినిమాకు క్లియరెన్స్ ఇవ్వలేదు. సినిమాలను తెరకెక్కించడం కన్నా ఆ సినిమాను రిలీజ్ చేయడం పెద్ద కష్టమవుతుంది. ఈ సినిమా పై సెన్సార్ బోర్డు వాళ్ళు ఎంత ఆపితే.. అంతకు మించి ఈ సినిమాను తెరమీదకు తీసుకొస్తానని వర్మ అన్నారు.. ఈ సినిమా పేరు మారింది.. కానీ ఇంకా విధులకు నోచుకోలేదు.. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది తెలియాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: