రాఖీ సినిమాలో జూ.ఎన్‌టీయార్. అన్నగా నటించి అందరి హృదయాలను తడి చేశారు. ఇప్పుడు కూడా ప్రియాంక రెడ్ది హత్య ఉదంతం విషయంలో రాష్ట్రం మొత్తం ఉడికిపోతుంది. ఈ విషయంలో స్పందించని మనిషి లేరు. నగర శివార్లలో వెటర్నరీ డాక్టర్‌ను అత్యంత పాశవికంగా రేప్ చేసి, హత్య చేసి, పెట్రోల్ పోసి తగలబెట్టిన నలుగురు కామాంధులను కఠినంగా శిక్షించాలంటూ దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు రేగాయి.

 

 

వాళ్లను పందికొక్కుల్లా పోలీస్‌ల పరిరక్షణలో మేపడం కాదు.. బహిరంగంగా ఉరితీయాలంటూ ఉవ్వెత్తున గళం వినిపిస్తోంది. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ, టెంపర్ చిత్రాల్లోని ఎమోషనల్ డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవేమంటే అమ్మలా కాపాడుకోవాల్సిన అమ్మాయిల్ని క్రూరమృగాళ్లుగా మీద పడి రేప్‌లు చేసి చంపేస్తుంటే వాళ్లకు తగిన శిక్ష చంపేయడమే అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ కంటతడిపెట్టిస్తున్నాయి.

 

 

ఇదే కాకుండా మొత్తం 49 మర్డర్స్ నేనే చేశాను.. పూర్తి సృహతో పూర్తి ఆరోగ్యంతో పగడ్భందీగా ప్లాన్ చేసి మరీ చంపేశా. దానికి పూర్తి బాధ్యత నాదే సార్. సార్ ఒక యాభై మందిని చంపేయ గానే మీడియా ప్రభుత్వం ప్రజలు అదేదో అణుబాంబు పడ్డట్టు అల్లకల్లోలం అయిపోయారే.. మన జన్మలకు కారణమై, మన రక్తాలు పంచుకుని మన జీవితంలో సగభాగమైన ఆడవాళ్ల మీద ఎన్ని.. ఎన్ని.. ఎన్ని.. దారుణాలు సార్. నీచాతినీచంగా క్రూరాతి క్రూరంగా జరుగుతున్నాయి. ఒక్కడైనా సార్.. పట్టించు కున్నాడా? నిలదీశాడా? పోనీ ఆపే ప్రయత్నమైనా చేశాడా? అసలేం జరుగుతుంది మన దేశంలో...?

 

 

మన అమ్మలు.. మన అక్కలు.. మన చెల్లెల్లు బయటకు వెళ్తే.. తిరిగి వచ్చేవరకూ ఎందుకు సార్ మనం భయం భయంగా ఉంటున్నాం. బిక్కు బిక్కుమంటూ ఎందుకు ఉంటున్నాం. అరే.. వాళ్లు ఏమైనా అడవుల్లోకి ఎడారుల్లోకి వెళ్తున్నారా? మనలాంటి మనుషుల మధ్యలోకే కదా సార్ వెళ్లేది. అంటూ సాగే ఎమోషనల్  డైలాగ్స్ ఇప్పుడు తెగ చక్కెర్లు కొడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: