ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమా తో ఊహించని రిజల్ట్ దారుణమైన ఫ్లాప్ రూపంలో రావడంతో స్క్రిప్ట్ విషయంలో చాలా పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమాలో త్వరలో నటించబోతున్న విజయ్ దేవరకొండ...స్క్రిప్ట్ విషయంలో పూరి జగన్నాథ్ ని రిక్వెస్ట్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినబడుతున్నాయి. ఇక పూరి జగన్నాథ్ ఇటీవలే వరుస ఫ్లాపుల తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమా తో అదిరి పోయే మాస్ హిట్ అందుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో 'ఫైటర్' అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన పూరి..సినిమా ఎప్పుడు మొదలవుతుంది అన్నదానిపై క్లారిటీ ఇవ్వలేదు.

 

మరోపక్క విజయ్ దేవరకొండసినిమా కోసం తన బాడీ షేప్ మొత్తం మార్చుకుంటూ జిమ్ లో వర్కౌట్ చేస్తున్నట్లు ఈ సినిమాలో చాలా రఫ్ లుక్ లో కనిపించడానికి రెడీ అవుతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. అంతేకాకుండా స్పెషల్ గా మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా సినిమా స్క్రిప్ట్ మొత్తం మార్చాలని … తాజాగా విజయ్ దేవరకొండ డైరెక్టర్ పూరి జగన్నాధ్ నీ రిక్వెస్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

విషయంలోకి వెళితే ఇటువంటి స్క్రిప్టు మాదిరిగానే మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్... కిరణ్ కొర్రపాటి కాంబినేషన్ లో బాక్సింగ్ కథ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కథాంశం …. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ చేయబోయే సినిమా స్టోరీ దగ్గరదగ్గరగా పోలిక కొద్దిగా ఉంటున్నట్లు వార్తలు రావడంతో వెంటనే స్క్రిప్టు మార్చాలని డైరెక్టర్ పూరికి … హీరో విజయ్ దేవరకొండ సూచించినట్లు ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: