ప్రభాస్ సాహోతో డిసప్పాయింట్ అయ్యాడు. బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటే ఫట్ అయి కూర్చుంది. అయితే బాలీవుడ్లో ప్రభాస్ ని తిరుగులేని హీరోను చేసింది. దాంతో ప్రభాస్ ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న జాన్ లో కూడా మార్పులు చేర్పులు చేస్తున్నాడుట. ఈ మూవీ కధ ప్రకారం ఫారిన్లో 60 శాతం పైగా షూటింగ్ జరుపుకోవాలి. అయితే దాన్ని భారీ సెట్లు వేసి ఇక్కడే తీస్తున్నారుట.

 

ఇక జాన్ మూవీ కధ విషయానికి వస్తే ఇది పునర్జన్మల కధగా చెబుతున్నారు. 1960 నాటి ప్రేమకధలో ఒక ప్రభాస్ కనిపిస్తే ఆయన కొడుకుగా మరో ప్రభాస్ కనిపిస్తాడడ. అంటే తండ్రి ప్రేమ విఫలం అవుతుంది. కొడుకు గా పుట్టి ఆ ప్రేమను జయిస్తాడు. చూస్తూంటే అ ఇలాంటి కధలతో ఎన్నో సినిమాలు గతంలో వచ్చాయని అనిపిస్తోంది.

 

అయితే జాన్ సినిమా లైన్ పాతదైనా దాన్ని మంచి ట్రీట్మెంట్ తో  జనాల ముందుకు తీసుకువస్తారట. ఈ మూవీ విషయంలో హిట్ కచ్చితంగా కొడతామని చిత్ర యూనిట్ టీమ్ ధీమాగా ఉన్నారని టాక్. ఇక   హీరోయిన్ గా పూజా హెగ్డే  గ్లామర్ పెద్ద  అసెట్. ఈ మూవీలో  ప్రభాస్ ధనవంతుడిగా నటిస్తే పూజ మాత్రం పేదరాలిగా కనిపిస్తోందట. ఈ ఇద్దరి మధ్యన ప్రేమ ఎలా పుట్టింది అన్నదే పాయింట్.

 

మరో విషయం ఏంటంటే ప్రభాస్, పూజల మధ్య కెమిస్ట్రీ  కూడా బాగా వర్కౌట్ అవుతోందని అంటున్నారు. ఫ్రెష్ కాంబో కావడం కూడా మూవీకి అడ్వాంటేజ్ అని అంటున్నారు. ఇక ప్రభాస్ పూజల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు కూడా యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయని అంటున్నారు. మొత్తానికి జాన్ మూవీని వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది రిలీజ్ చేయలని ప్లాన్ చేస్తున్నారుట. అంటే ప్రభాస్ అభిమానులు మరి కొంతకాలం వెయిట్ చేయాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: