టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో తెరకెక్కిస్తున్న భారీ మల్టి స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జులై 30న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా అలానే ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్న ఈ సినిమాకు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా, కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. 

 

ఇక ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటివరకు తాను తీసిన సినిమాల్లో అత్యంత భారీ విజయాన్ని అందుకున్న బాహుబలి 2 రికార్డులను తుడిచిపెట్టాలా, ఈ ఆర్ఆర్ఆర్ మూవీ విషయమై రాజమౌళి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాను మొత్తం పది భాషల్లో అధికారికంగా రిలీజ్ చేస్తాం అని ఇటీవల ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రకటించడం జరిగింది. ఇక బాహుబలి సినిమాలు మాత్రం మొత్తంగా కేవలం నాలుగు భారతీయ భాషల్లోనే రిలీజ్ చేసారు. 

 

అవి తెలుగు, తమిళ, హిందీ, మలయాళం. కాగా ఆ సినిమా కన్నడ భాషలో మాత్రం రిలీజ్ కాలేదు. అయితే ఇప్పుడు తెరకెక్కుతున్న ఈ ఆర్ఆర్ఆర్ ను మొత్తం ఐదు భారతీయ భాషలతో పాటు మరొక ఐదు విదేశీ భాషల్లో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారంటే, ఈ సినిమాకు రిలీజ్ సమయంలో కేటాయించే థియేటర్స్ ఏ స్థాయిలో ఉంటాయో అర్ధం చేసుకోవచ్చని, ఈ ఒక్క ఘటనను బట్టి రాజమౌళి బాహుబలి రికార్డ్స్ ని బద్దలు కొట్టేలా ఆర్ఆర్ఆర్ మూవీ టార్గెట్ ని ఏ విధంగా ఫిక్స్ చేసారో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎంత మేర సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: