దేశంలో నేనే సీనియర్ నాయకుడిని నాకున్న అనుభవం ఎవరికీ లేదు 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటూ తెగ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు కి దిమ్మతిరిగిపోయే విధంగా ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైయస్ జగన్ ఆరు నెలలోనే చంద్రబాబు సాధించలేనిది సాధించి చూపించారు. విషయంలోకి వెళితే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఎక్కడా కూడా రాష్ట్రంలో అవినీతి లేకుండా పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఎక్కడా కూడా అవినీతి జరగకుండా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి పేదవాడికి సామాన్యుడికి అందేలా పరిపాలన ఉంటుందని ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజే ప్రజలకు జగన్ హామీ ఇవ్వడం జరిగింది.

 

ఇదే క్రమంలో తర్వాత రోజు నుండి చెప్పిన మాటను నిలబెట్టుకునే విధంగా ప్రభుత్వ అధికారులతో మీటింగులు పెట్టి అక్రమంగా చంద్రబాబు కట్టిన ప్రజావేదికను కూల్చి పరిపాలన స్టార్ట్ చేసిన జగన్ రాష్ట్రంలో ఎక్కడా కూడా అవినీతి లేకుండా తగు చర్యలు చేసుకుంటూ అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందిస్తూ ముఖ్యంగా ప్రజా సంకల్ప పాదయాత్రలో అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటు పోతూ ఎన్నికల తనదైన శైలిలో పరిపాలన అందిస్తున్నారు జగన్.

 

ఇదిలా ఉండగా తాజాగా దేశంలో అవినీతి ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రాల లిస్ట్ ఇటీవల విడుదల కాగా గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో అవినీతి చేసే రాష్ట్రంగా నమోదు కాగా తాజాగా జగన్ అధికారంలోకి వచ్చాక ఆరు నెలలోనే ఎక్కడా కూడా అవినీతి లేకుండా పరిపాలిస్తున్న నేపద్యంలో దేశంలో అవినీతి జరుగుతున్నా రాష్ట్రాలలో రెండో స్థానంలో ఉండవలసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేవలం ఆరు నెలల పరిపాలనలో 13వ స్థానం లోకి తీసుకువచ్చారు సీఎం జగన్. కేవలం జగన్ ఆరు నెలల్ల పరిపాలనలో ఈ మాత్రం రాష్ట్రంలో మార్పు రావడంతో చాలా మంది దేశంలో ఉన్న పెద్దపెద్ద నాయకులు జాతీయ నాయకులు జగన్ పరిపాలన గురించి కథలు కథలు గా చెప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: