స్వామి రారా సినిమా నుంచి ప్రతి సినిమాకు వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ అటు ప్రేక్షకుల ప్రశంసలతో పాటు అటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందుతున్న యంగ్ హీరో నిఖిల్ తాజాగా నటించిన అర్జున్ సురవరం మూవీ శుక్రవారం థియేటర్లలోకి దిగింది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యి యేడాది అవుతున్నా అనేక ఆర్థిక క‌ష్టాల నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఎన్నో సార్లు వాయిదాల మీద వాయిదాలు ప‌డింది.

 

ఇక ఎన్నో వ్యప్రయాసలకోర్చి ఎట్టకేలకు అర్జున్ సురవరం మూవీ నిన్న థియేటర్స్ లోకి దిగింది. హీరో నిఖిల్, లావణ్య జంటగా అర్జున్ సురవరం మూవీ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. తమిళ దర్శకుడు టి సంతోష్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇక శుక్ర‌వారం రిలీజ్ అయిన ఈ సినిమాకు తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం అయ్యింది. ఇక నిఖిల్ న‌ట‌న ఓ సీరియ‌స్ జ‌ర్న‌లిస్టు లైఫ్ ఎలా ఉంటుందో ?  అలాగే ఉండ‌డంతో ప్ర‌తి ఒక్క ప్రేక్ష‌కుడు ఈ సినిమాకు క‌నెక్ట్ అవుతున్నాడు.

 

ఈ క్ర‌మంలోనే అర్జున్ సుర‌వ‌రం తొలి రోజు కూడా మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి మొదటిరోజు 1.6 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 4.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్టు చిత్ర యూనిట్ పోస్టర్ విడుదల చేశారు. ఇక ఈ సినిమాకు వ‌స్తోన్న స్పంద‌న నేప‌థ్యంలో ఈ సినిమా బ‌య్య‌ర్లు అద‌న‌పు స్క్రీన్స్ కూడా పెంచార‌ని తెలుస్తోంది.

 

ఇక 2016లో వచ్చిన ఎక్కడికిపోతావు చిన్నవాడా, మూవీ తరువాత హిట్ కొరకు తపిస్తున్న నిఖిల్‌కు ఈ సినిమా హిట్ అవ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా రు. 7 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా రు. 7 కోట్ల షేర్ సాధిస్తే బ్రేక్ ఈవెన్‌కు వ‌చ్చేస్తుంది. ప్ర‌స్తుతం సినిమాలు పోటీగా లేక‌పోవ‌డంతో నిఖిల్‌కు ఈ టార్గెట్ పెద్ద క‌ష్టం కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: