బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి వరుస ఫెయిల్యూర్స్ వస్తున్న సమయంలో ‘దబాంగ్’ సినిమా మంచి బూస్టింగ్ ఇచ్చింది.  ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా మాస్ యాక్షన్ తో దుమ్మురేపాడు సల్మాన్ ఖాన్.  ఈ మూవీ హిట్ తర్వాత సీక్వెల్ గా దబాంగ్ 2 వచ్చింది.  ఈ మూవీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  దాంతో దబాంగ్ 3 పై దృష్టి పెట్టారు దర్శకులు, నటుడు ప్రభుదేవా.   అనుకున్నదే తడవు సల్మాన్-ప్రభుదేవా కాంబినేషన్ లో ‘దబాంగ్ 3’ తెరకెక్కిస్తున్నారు.  ఈ మూవీ  క్రిస్మ‌స్ కానుక‌గా విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ప్రమోషన్ బిజీలో ఉన్నారు చిత్ర యూనిట్.  

 

సల్మాన్ - ప్రభుదేవా కాంబినేషన్ లో ఇప్పటికే ‘వాంటెడ్’ సినిమా వచ్చింది.   ఈ మూవీ తెలుగులో మహేష్ బాబు నటించిన ‘పోకిరి’ రిమేక్.  దబాంగ్ 3 లో  చుల్‌బుల్ పాండేగా అల‌రించ‌నున్నాడు స‌ల్మాన్‌. డిసెంబ‌ర్ 20న తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ భాష‌ల‌లో ఈ చిత్రంలో కిచ్చా సుదీప్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర పోషిస్తున్న‌ట్టు తెలుస్తుంది.   ఇటీవ‌ల మూవీకి సంబంధించి హుద్ హుద్ సాంగ్ విడుద‌ల చేశారు మేక‌ర్స్ . ఇందులో సల్మాన్ సాధువుల‌తో క‌లిసి న‌ర్మ‌దా న‌ది ద‌గ్గ‌ర డ్యాన్స్ చేస్తాడు.  

 

అయితే ఇది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని ఓ వర్గం వారు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. ముఖ్యంగా హిందు జాగృతి స‌మితి ద‌బాంగ్ 3 చిత్రాన్ని బాయ్‌కాట్ చేయాల‌ని డిమాండ్ చేస్తూ, సెన్సార్ బోర్డ్ వారు స‌ర్టిఫికెట్ ఇవ్వొద్ద‌ని కోరింది. అయితే #BoycottDabangg3 అనే హ్యాష్ ట్యాగ్‌ని సోష‌ల్ మీడియాలో ట్రెండ్ చేస్తుంటే ఆయ‌న అభిమానులు #AwaitingDabangg3 ని ట్రెండ్ చేస్తున్నారు.  

 

ఇప్పటికే బాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సినిమాలు కాంట్రవర్సీలు పడుతున్న విషయం తెలిసిందే.  మరి ఈ దబాంగ్ 3 విషయం ఎలా ఉంటుందో అని తెగ చర్చలు జరుపుకుంటున్నారు.   నెటిజ‌న్స్ రెండు గ్రూపులుగా విడిపోయి సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తున్నారు. సోనాక్షి సిన్హా చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: