హైదరాబాద్ శివారు ప్రాంతం షాద్ నగర్ లో జరిగిన ప్రియాంక రెడ్డి అత్యాచారం కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. జరిగిన ఘటనపై చాలామంది రాజకీయ నేతలు మరియు సెలబ్రిటీలు అదేవిధంగా వివిధ ఇండస్ట్రీలకు చెందిన సినిమా హీరోలు డైరెక్టర్లు ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. వివిధ పార్టీలకు చెందిన ప్రముఖ రాజకీయ నేతలు ఈ ఘటనపై తమదైన శైలిలో స్పందించక తాజాగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా స్పందించడం జరిగింది. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుకున్నారు. వైసిపి పార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా కూడా ప్రియాంక రెడ్డి హత్య కేసు విషయమై తనదైన శైలిలో స్పందించడం జరిగింది.

 

ఈ సందర్భంగా ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ఆర్కే రోజా తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు ఈ ఘటనకు పాల్పడిన నిందితులపై పోలీసులు చార్జిషీటు దాఖలు చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. వీరంతా నారాయణపేట జిల్లా మక్తల్ మండలానికి చెందిన వారని తెలిపారు. లారీలపై పని చేసే ఈ నలుగురూ పక్కా ప్లాన్ ప్రకారమే ప్రియాంక రెడ్డి ట్రాప్ చేసి గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారని.. అనంతరం దారుణంగా హత్య చేశారని వెల్లడించారు.

 

మరోపక్క ఈ అత్యాచారం ఘటనపై సోషల్ మీడియాలో మరియు బయట పబ్లిక్ లో కూడా దోషులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇంకొకసారి ఇటువంటి ఘటన దేశంలో జరగకుండా సరైన నిర్ణయం దేశంలో ఉన్న ప్రభుత్వాలు మరియు న్యాయస్థానాలు తీసుకోవాలని… నిర్భయ చట్టాలు కంటే ఇంకా కఠినమైన చట్టాలు వస్తేనే మానవ ముసుగులో ఉన్న మృగాల ఆలోచనలో మార్పులు వస్తాయని డిమాండ్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ సెలబ్రిటీలు కూడా దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: