యంగ్ హీరో  నిఖిల్ నటించిన  లేటెస్ట్  మూవీ  అర్జున్ సురవరం నిన్న విడుదలై మిక్సడ్ రివ్యూస్  రాబట్టుకుంది. అయితే  టాక్ డీసెంట్ గా ఉండడంతో  మొదటి రోజు ఈచిత్రం మంచి ఓపెనింగ్ ను రాబట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా   మొదటి రోజు ఈ చిత్రం  4కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని సమాచారం. ఇదిలా ఉంటే  తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం   మొదటి రోజు 1.65 కోట్ల షేర్ ను రాబట్టింది.  మార్నింగ్ , మ్యాట్నీ షోస్ డల్ గా నడిచినా  ఈవెనింగ్ , నైట్ షోస్  హౌస్ ఫుల్ కావడం తో ఈ చిత్రం మొదటి రోజు డీసెంట్ వసూళ్లను రాబట్టింది.  ఇక ఈ రోజు , రేపు కూడా ఈ  చిత్రం  మంచి వసూళ్లను రాబట్టుకోనుంది.
 
 
ఓవర్సీస్  లో కూడా  ఈ చిత్రం మొదటి రోజు  పర్వాలేదనే వసూళ్లను రాబట్టుకుంది.  ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వేరే సినిమాలతో పోటీలేకపోవడం కూడా ఈ సినిమా కు కలిసి రానుంది.  ఈచిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 7.5కోట్ల వసూళ్లను రాబట్టాలి మరి ఫుల్ రన్ లో ఈ చిత్రం ఈ మార్క్ ను క్రాస్ చేస్తుందో లేదో చూడాలి.  కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ  'కనితన్' కి  రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో  నిఖిల్ కు జోడిగా లావణ్య త్రిపాఠి నటించగా  సామ్ సి ఎస్ సంగీతం అందించాడు.  ఒరిజినల్ వెర్షన్ ను తెరకెక్కించిన  టియెన్ సంతోషే ఈ రీమేక్ ను కూడా డైరెక్ట్ చేయగా  రాజ్ కుమార్ ఆకేళ్ల , కావ్య వేణుగోపాల్  సంయుక్తంగా  నిర్మించారు.
 
 
 
ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సినిమాస్ ఈ సినిమా విడుదలచేసింది.   ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ మాఫియా నేపథ్యంలో  తెరకెక్కిన  ఈ చిత్రంలో  నిఖిల్ జర్నలిస్ట్ గా నటించాడు. 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: