సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు లైఫ్ చాలా తక్కువ. హీరోలతో పోలిస్తే వీళ్లకు అంత లైఫ్ ఉండదు. హీరోలు సుదీర్ఘకాలంపాటు సినిమాల్లో నటిస్తూనే ఉంటారు. అందులో స్టార్ హీరోలుగా ఉన్న వాళ్ళు అయితే నాలుగు దశాబ్దాల పాటు సినిమాల‌లో నటించడం కూడా కామన్ అయిపోయింది. మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్లు ఇప్పటికే నాలుగు దశాబ్దాలకు పైగా స్టార్ హీరోలుగా ఉన్నారు. అలాంటి పరిస్థితి హీరోయిన్ల‌కు ఉండదు. వాళ్ల లైఫ్‌ మహా అయితే పది సంవత్సరాలు మాత్రమే ఉంటుంది.

 

చాలా మంది అయితే ఏ మూడో నాలుగో సంవ‌త్స‌రాలు మాత్ర‌మే సినిమాల్లో ఉంటారు. ఈ క్రమంలోనే కెరీర్లో సినిమా అవకాశాలు తగ్గిపోతున్న టైంలో ఇప్పటి హీరోయిన్లు చాలామంది ముందు జాగ్రత్తగా సైడ్ బిజినెస్ ప్రారంభిస్తున్నారు. చిన్నాచితక హీరోయిన్లే కాదు సమంత లాంటి స్టార్ హీరోయిన్లు సైతం దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్న నానుడితో వెబ్ సిరీస్ లోకి దిగి పోతున్నారు.

 

రీసెంట్ గా ఈ లిస్ట్ లోకి సమంత కూడా చేరింది. సూపర్ హిట్టయిన ది ఫ్యామిలీ మేన్ వెబ్ సిరీస్ సీజన్-2లో సమంత నటిస్తోంది. ఇక త‌మ‌న్నా కూడా ఓ వెబ్ సీరిస్‌కు ఓకే చెప్పేసింది. ఇది హాట్ స్టార్‌లో ప్ర‌సారం అవుతుంది. ఈ లిస్ట్ లోకి ఇషా రెబ్బా కూడా చేరిపోయింది. తెలుగమ్మాయిని కాబట్టే తనకు అవకాశాలు తక్కువగా వస్తున్నాయంటూ రీసెంట్ గా బాంబ్ పేల్చిన ఈ భామ, ఆ వెంటనే వెబ్ సిరీస్ కు షిఫ్ట్ అయింది. ఈ సీరిస్‌లో ఆమె చాలా హాట్ హాట్‌గా క‌నిపించ‌బోతోంద‌ట‌.

 

ఇక ఛాన్సులు త‌గ్గిపోతోన్న మ‌రో భామ హ‌న్సిక సైతం వెబ్ సీరిస్‌కు ఓకే చెప్పేసింది.  సాక్షి చౌదరి, రష్మీ గౌతమ్, సంజన లాంటి తారలు కూడా వెబ్ సిరీస్ కు రెడీ అవుతున్నారు. వీళ్లలో సంజన, హాట్ గా ఉండే ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇక రాధిక ఆప్టే, మంజరి ఫడ్నిస్, ప్రియమణి, స్వరభాస్కర్, కైరా అద్వానీ, కల్కి కొచ్లిన్ లాంటి హీరోయిన్లు ఇప్పటికే వెబ్ సిరీస్ లోకి ప్రవేశించారు. ఏదేమైనా ఈ హీరోయిన్ల సైడ్ బిజినెస్ బాగానే ఉంద‌న్న‌మాట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: