తేజు తాజా చిత్రంగా 'ప్రతిరోజూ పండగే'.  వచ్చేనెల 20వ తేదీన భారీ విడుదల. గీతా ఆర్ట్స్ లోనే తదుపరి సినిమా అన్నట్టు తెలుస్తున్నది . కెరియర్ స్టార్టింగ్‌లోనే మంచి మంచి హిట్‌లు కొట్ట‌డంతో సాయిధరమ్ తేజ్ వ‌రుస హిట్లు ఇస్తూ వెళ్లాడు. ఇటు యూత్ కి .. అటు మాస్ ఆడియన్స్ కి ఆయనను చేరువ చేసిన సినిమాల్లో 'పిల్లా నువ్వులేని జీవితం' ఒకటి. అల్లు అరవింద్ ఈ సినిమాతో తేజూను కొంతవరకూ నిలబెట్టగలిగారు. ఈ మధ్య కాలంలోను తేజు వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు.

 

ఈ నేపథ్యంలోనే 'గీతా ఆర్ట్స్ 2' బ్యానర్ పై అల్లు అరవింద్ .. తేజుతో 'ప్రతిరోజూ పండగే' సినిమా చేస్తున్నారు. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వచ్చేనెల 20వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా తరువాత కూడా తేజూతో అల్లు అరవింద్ మరో సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళ‌నుంద‌ని అన్నారు. త్వరలోనే ఆ వివరాలను తెలియపరచనున్నారు.

 

ప్రతిరోజూ పండగే చిత్రంలో ఓ బావ అంటూ సాగే' పాటను కృష్ణకాంత్ రాశారు. విదేశాల నుంచి వచ్చిన ఓ బావ తన మరదలి మనసు గెలవడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. అయిన ఆమె మాత్రం బెట్టు చేస్తుంది. కజిన్స్ అంతా కల్సి..బావను పెళ్లి చేస్కో...ఎంత మంచోడో అంటూ అక్కకు చెప్పే.. ఈ 'ఓ బావ' పాట 'ప్రతిరోజు పండగే' చిత్రంలోనిది.అమెరికా నుంచి వచ్చిన ఓ అబ్బాయి తన మరదలి కోసం పడే తపన ఈ సాంగ్‌లో కనిపిస్తుంది. బావా ఎంత ట్రై చేసినా..మరదలు బెట్టు చేస్తుందని అర్థమవుతోంది. అందుకే ఎందుకు ఇలా చేస్తున్నావని ఆమె చెల్లెళ్లు ..అడుగుతూ..బావ మంచోడు పెళ్లి చేస్కో అని బావ గొప్పతనం చెబుతుంటారు. ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే మా అక్కను సక్కగా చూసుకో బావ అని ఆటపట్టిస్తున్నారని..కేకే తన భావాన్ని లిరిక్స్‌లో ఇమిడ్చాడు. ఈ పాట యూ ట్యూబ్‌లో దుమ్ములేపుతోంది..ఇదిగో లిరిక్స్ .. మీరు పాడుకోండి మరి!

మరింత సమాచారం తెలుసుకోండి: