హీరో కి హీరోయిన్ కి ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే  ఒక హీరో వరుసగా  ఫ్లాపులు ఎదురైనా అతనికి అవకాశాలు వస్తాయి ఏమో కానీ హీరోయిన్ పరిస్థితి అలా ఉండదు.  నాలుగు ఫ్లాపులు తగిలితే ఇక తట బుట్ట సర్దుకుని బయలు దేరాలిసిందే. అందాల రాక్షసితో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన లావణ్య త్రిపాఠి పరిస్థితి కూడా నిన్న మొన్నటి వరకూ దాదాపుగా ఇలానే ఉంది.

 

చివరికి దాదాపు ఒక సంవత్సరం నుంచి అసలు కనిపించటం లేదు. అప్పుడు అప్పుడు సోషల్ మీడియా హుల్చుల్ చేసేది. కానీ మొన్న శుక్రవారం విడుదల అయిన 'అర్జున్ సురవరం' తో ఒక్కసారిగా లావణ్య ఫామ్ లోకి వచ్చేసింది.

Image

 

'అర్జున్ సురవరం' విడుదలకు ముందు లావణ్య నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచాయి. చివరికి 'అర్జున్ సురవరం' మీద నమ్మకం పెట్టుకుంటే వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉండడంతో లావణ్య కూడా చాల నిరాశ పడింది.  ఎట్టకేలకు 'అర్జున్ సురవరం' నవంబర్ 29 న విడుదలైంది. సినిమాకు మంచి టాక్ తో పాటు కలెక్షన్లు కూడా  వచ్చాయి. నిఖిల్-లావణ్య జోడీ మధ్యలో కెమిస్ట్రీ  బాగుందని చాలా మంది అన్నారు. కెమిస్ట్రీ సమీరణాలతో పాటుగా డేరింగ్ డాషింగ్ గా ఉండే విలేఖరి పాత్రలో లావణ్య నటనకు ప్రేక్షకుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి.

 

లేట్ అయినా లేటెస్ట్ గా వస్తా అన్నట్టుగా లావణ్య ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉందట.  ఈ సినిమాకు చక్కని ఆదరణ దక్కడంతో తనకు మంచి ఆఫర్లు వస్తాయని నమ్మకంగా ఉందట.  ఇదే కాకుండా 'అర్జున్ సురవరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లావణ్య నవ్వును ఏకంగా మెగాస్టార్ చిరంజీవి మెచ్చుకోవడంతో ఒక్కసారిగా అందరి దృష్టి లావణ్యపై పడిందనడంలో సందేహం లేదు.  ఏది ఏం అయిన అందాల రాక్షసి ఫామ్ లోకి వచ్చేసిందని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: