తెలుగు, తమిళ సినిమలలో నిత్యా మీనన్ కి ఎంతో క్రేజ్ ని సంపాదించుకుంది. కథ అందులోని తన పాత్ర నచ్చితేనే ఒప్పుకునే నిత్యా ఏమాత్రం అసభ్యకరమైన సీన్స్ ఉన్నా నిర్మొహమాటంగా నో చెప్పేస్తుంది. అందుకే తన సినిమాలు అందరిని ఆకట్ట్కుంటాయి. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేయడం నిత్యాకి అలవాటు. ఏదైనా మనసుకు నచ్చితేనే చేస్తుంది. తనకు నచ్చినట్టే ఉంటుంది. కెరీర్ విషయంలోనూ ఎప్పూడూ రాజీపడలేదు నిత్యా. తనకంటూ ఓ వ్యక్తిత్వం ఉందని నిరూపించింది. స్టార్ హీరోల ఆఫర్లు అయినా తనకు నచ్చకపోతే సూటిగా నచ్చలేదని ముఖం పైనే చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక నటన, ప్రతిభ పరంగానూ.. జూనియర్ సౌందర్య అంతటి ప్రతిభావంతురాలు అని తెలుగు సినీపరిశ్రమ ప్రత్యేకంగా గౌరవించింది. 

 

నిత్యా ఏం చేసినా అది అభిమానుల్లో హాట్ టాపిక్. ప్రస్తుతం తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో నటించేందుకు ప్రిపరేషన్ లో ఉన్న నిత్యా గోవా పిలింఫెస్టివల్ లో పాల్గొన్నారు. అక్కడ మీడియాతో మీటూ ఉద్యమ స్ఫూర్తి గురించి మాట్లాడారు. పరిశ్రమలో తనకు ఎదురైన అనుభవాల గురించి చెబుతూ అమ్మాయిలు పని చేసే ప్రతి చోట చెడు ప్రవర్తన ఎదురైతే ఎలా గుణపాఠం చెప్పాలో కూడా సూచించింది.

 

తనకు కూడా అలాంటి అనుభవాలు ఎదురయ్యాయని.. అయితే చెడుగా ప్రవర్తించిన వాళ్లను పిలిచి బయటకు పొమ్మని హెచ్చరించానని నిత్యా వెల్లడించారు. మీకు గౌరవం అవసరం లేదా? అది మిగలాలంటే చెడు ప్రవర్తన ఉండకూడదు! మానుకోవాలి అంటూ వార్నింగ్ ఇచ్చినట్లు తెలిపారు. చెడు ప్రవర్తన అనేది అన్నిచోట్లా ఉంది. కేవలం సినీపరిశ్రమలోనే కాదు అని నిత్యా వెల్లడించింది. మనం తప్పు దారిలో లేనప్పుడు మనకు అలాంటివి ఎదురవ్వవు. మనం ఒప్పుకుంటేనే సమస్య. పని చేసే చోట వేధింపుల విషయంలో రాజీ పడాలా వద్దా అన్నది మనం నిర్ణయించుకునేదే. ఇలాగే ఉండు అని ఎవరూ బలవంతం చేయరు. నా వరకూ సురక్షితం కాని పరిస్థితులు ఎప్పుడూ ఎదుర్కోలేదు అని నిత్యా తెలిపింది. తనూ మీటూ బాదితురాలని ఇన్‌డైరెక్ట్ గా చెప్పింది నిత్యా. 

మరింత సమాచారం తెలుసుకోండి: