జఫ్ఫా అనగానే ఎవరికైనా మెహం లో నవ్వు అలాగే  ఠక్కున గుర్తుకొచ్చేది హాస్యబ్రహ్మ  నటుడు బ్రహ్మానందం. ఎవరినైనా కామెంట్ చేయాలన్న ఎవరినైనా తిట్టాలన్న ఈ ఊత  పదాన్ని మన తెలుగు సినిమాల్లో వాడుతుంటారు అది బ్రహ్మనందం వాడారంటే ఎవరికైనా నవ్వు రాకుండా ఆపుకోలేము.  ఈ పదం తో ఏకంగా బ్రహ్మనందం మరియు హాస్యనటులంతా కలిసి ఏకంగా సినిమాయే తీశారంటే ఆ పదానికి మరియు  బ్రహ్మనందం కు ఉన్న అనుబంధాన్ని ఊహించుకోవచ్చు.

 

అయితే జఫ్ఫా అనే పదం  తెలుగు తిట్ల కోసం వాడే ఊతపదం కాగా  మరి ఆ మాటకు అర్థం అని ఆరా తీయగా జఫ్ఫా అనేది తిట్టు కాదు అని ఇజ్రాయెల్‌ సముద్ర తీరంలో ఉన్న ఓ పోర్టు సిటీ పేరు అయితే, ఇలాంటి నగరం ఒకటి ఉందని తెలుగు ప్రజలకు తెలియకపోవడం, బ్రహ్మనందం దాన్ని ఊతపదంగా మార్చుకుని అందరినీ జఫ్ఫాగాళ్లని తిట్టడంతో తెలుగువాళ్లంతా  దాన్ని తిట్టడానికి వాడే పదాల  జాబితాలో కలిపేశారు. అయితే ఇజ్రాయెల్‌ సముద్ర తీరంలో ఒక వంటకానికి చాలా మంచి పేరు ఉంది అది వంటకం అవ్వడం  అది కేకు అవ్వడం మరో ఆశ్చర్యకరమైన అంశం. 

క్రిస్మస్ పండుగలను పురస్కరించుకుని కో ఆంట్రిమ్ అనే పట్టణం లోని ఒక  చిప్ షాప్ సరికొత్తగా అలోచించి అందరిని తన  వంటకంతో కస్టమర్లను  సర్‌ప్రైజ్ చేయాలని భావించింది ఆ వంటకం ఏమిటంటే జఫ్ఫా అనే  ఓ సరికొత్త కేకు. ఈ కేకును తమ స్టోర్‌కు వచ్చే కస్టమర్లకు ఉచితంగా పంచుతూ ఆకట్టుకుంటోంది. అయితే, ఈ కేకుల పేరును   జఫ్ఫా  అనే పేరునే ఎందుకు సెలక్ట్ చేశారనే విషయం  ఎంతవరకు  తెలియలేదు. తెలిసి పెట్టారో.. తెలియక పెట్టారో తెలీదుగానీ, ఈ కేకుకు ఆ పేరు కరక్టే అనిపిస్తోంది. ఈ విషయం తెలిసిన తెలుగువాళ్లు మాత్రం నవ్వుకుంటేన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: