ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ ఎవరన్నా ఉన్నారంటే అది పూరి జగన్నాధ్ మాత్రమే. 70 ఏళ్ళకి చూడాల్సిన జీవితం 40 ఏళ్ళకే చూసేశాడు పూరి. ఇక ఆయన సినిమా కథ ఒకసారి అనుకుంటే మార్చిన సందర్భాలు గాని మార్చమన్న హీరోలు గాని లేరనే చెప్పాలి. పూరీ పవన్ కళ్యాణ్ తో తీసిన బద్రినే ఇందుకు ఉదాహరణ. క్లైమాక్స్ మార్చమన్న పవన్ మాటని పక్కనబెట్టి అదే క్లైమాక్స్ ని మళ్ళీ చెప్పి పవర్ స్టార్ ని ఇంప్రెస్ చేశాడు పూరి. అలాంటి పూరీ ఎన్నో బ్లాక్ బస్టర్స్ తీశాడు. హీరోలందరికి సూపర్ హిట్స్ ఇచ్చాడు. ఇక గీత గోవిందం, డియర్ కామ్రేడ్ తో డిజాస్టర్ ని నెత్తిమీదేసుకున్నాడు విజయ్ దేవరకొండ. అందుకే మంచి హిట్ కోసం తపిస్తున్నాడు. ఇక ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ ని అందుకున్న మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విజయ్ తో ఫైటర్ అనే చిత్రానికి సన్నాహాలు చేస్తున్నాడు. 

 

అయితే ఈ డిసెంబర్ లో మొదలవ్వల్సిన ఫైటర్ ఎప్పుడు మొదలవుతుంది? అన్నదానిపై ఇప్పటి వరకూ పూరి కానీ విజయ్ కానీ ఏ క్లారిటీని ఇవ్వలేదు. దీంతో మరోసారి ఫైటర్ మొదలవుతుందా..? ఆలస్యమవుతుందా? అంటూ సందేహం మొదలైంది. ఎందుకంటే పూరి ఒకసారి ప్రాజెక్ట్ మొదలు పెడితే రిలీజైయ్యో వరకు ఆగే ప్రసక్తే లేదు. కానీ ఫైటర్ కథాంశం గురించి ఇప్పటికే రకరకాలుగా ప్రచారం ఉంది. ఇందులో విజయ్ 6 ప్యాక్ తో రగ్గ్ డ్ గా కనిపిస్తాడని.. అందుకోసం కసరత్తులు చేస్తూ లుక్ ఛేంజ్ చేస్తున్నాడని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాడని ప్రచారమవుతోంది. అలాగే విజయ్ ఈ సినిమాలో మూగవాడిగా కనిపించి షాకిస్తాడని ప్రచారం జోరుగా సాగింది.

 

అయితే ఇవన్నీ గాసిప్సే అనుకుంటుంటే..అసలు ఈ స్క్రిప్టునే మార్చేయాలని పూరికి సూచించాడంటూ మరో ప్రచారం ఇప్పుడు సెన్సేషన్ అవుతోంది. ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి కాంబినేషన్ లో రూపొందుతున్న బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ సినిమా కథాంశంతో పోలిక ఉండడంతో స్క్రిప్టును మార్చాలని విజయ్ పూరికి చెప్పాడట. పూరీ కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే ఇది నిజమా కాదా? అన్నది పూరి బృందం రివీల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ ఫైటర్ పక్కన నటించే హీరోయిన్ ఎవరు అన్న విషయంలో పూరి క్లారిటీ ఇవ్వలేదు. జాన్వీ కపూర్ - కియరా అద్వానీ- నభా నటేష్ అంటూ రకరకాల పేర్లు వినిపించినా కానీ ఎవరిని ఫైనల్ చేయనేలేదని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: