హీరోలకి వరుసగా 5-6 ఫ్లాపులు వచ్చినా వాళ్ళకి మళ్ళీ అవకాశాలు వస్తుంటాయి. కానీ హీరోయిన్ పరిస్థితి అలా కాదు. నాలుగు ఫ్లాపులు పడితే ఇక హ్యాండ్ బాగు.. ట్రావెలింగ్ సూటుకేసు సర్దుకుని ముంబై ఫ్లైటు ఎక్కాల్సిందే. 'అందాల రాక్షసి' లావణ్య త్రిపాఠి పరిస్థితి కూడా నిన్నమొన్నటివరకూ ఇలానే ఉంది. దాదాపు సంవత్సరం నుండి సినిమాలు లేక సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో కాలక్షేపం చేసింది. అయితే ఈ అమ్మడు నటించిన 'అర్జున్ సురవరం' సినిమాతో ఒక్కసారిగా లావణ్య ఫామ్ లోకి వచ్చేసింది. అప్పుడెప్పుడో నానీ తో భలె భలే మగాడివోయ్ హిట్ తర్వాత మళ్ళీ కాస్త ఒకే అనిపించుకున్న సినిమా 'అర్జున్ సురవరం'.

 

'అర్జున్ సురవరం' విడుదలకు ముందు లావణ్య నటించిన నాలుగైదు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచాయి. 'అర్జున్ సురవరం' మీద నమ్మకం పెట్టుకుంటే వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉండడంతో లావణ్య కూడా నిరాశపడింది. ఎట్టకేలకు 'అర్జున్ సురవరం' నవంబర్ 29 న విడుదలైంది. సినిమాకు మంచి టాక్ తో పాటు డీసెంట్ రివ్యూస్ వచ్చాయి. నిఖిల్-లావణ్య జోడీ మధ్యలో ఫిజిక్స్ బాగుందని చాలామంది ప్రేక్షకులు చెప్తున్నారు. ఇకేఎ సినిమాలో డేరింగ్ డాషింగ్ గా ఉండే విలేఖరి పాత్రలో లావణ్య నటనకు ప్రేక్షకుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి.

 

లేట్ అయినా లేటెస్ట్ గా వస్తా అన్నట్టుగా లావణ్య ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉందట. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి చక్కని ఆదరణ దక్కడంతో తనకు మంచి ఆఫర్లు వస్తాయని నమ్మకంగా ఉందట. ఇదే కాకుండా 'అర్జున్ సురవరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లావణ్య నవ్వును ఏకంగా మెగాస్టార్ చిరంజీవి మెచ్చుకోవడంతో ఒక్కసారిగా అందరి దృష్టి లావణ్యపై పడిందనడంలో సందేహం లేదు. ఏదైతేనేం.. అందాల రాక్షసి ఫామ్ లోకి వచ్చేసిందని అనిపిస్తోంది. మరి వరుస ఆఫర్లతో లావణ్య మళ్ళీ బిజీ అవుతుందా లేక మరికొంతకాలం నిరీక్షణ తప్పదా అన్నది త్వరలోనే తెలుస్తుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: