మెగాస్టార్ చిరంజీవి మాటను వేదవాక్కుగా భావించే అభిమానులు లక్షల సంఖ్యలో ఉన్నారు. చిరంజీవి మేనరిజమ్స్ ను ఫాలో అయిన లక్షలాది మంది అభిమానులు చిరంజీవి చెప్పిన చారిటీని కూడా చేసి భళా అనిపించుకున్నారు. అందులో ముఖ్యమైనవి రక్తదానం, నేత్రదానం. చిరంజీవి మాటే వేదవాక్కుగా చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో ఎంతోమంది అభిమానులు కళ్లు దానం చేశారు.. నిత్యం రక్త దానం చేస్తున్నారు. ఇప్పుడు ఈ బ్లడ్ బ్యాంక్ కు జాతీయస్థాయిలో కూడా గౌరవం దక్కింది.

 

 

డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా చిరంజీవి బ్లడ్ బ్యాంకుకు ఉత్తమ బ్లడ్ బ్యాంకుగా అవార్డు వచ్చింది. ఈ అవార్డును ‘జాతీయ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, న్యూఢిల్లీ.. తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ’ సంయుక్తంగా ప్రకటించాయి. చిరంజీవి చారిటబుల్ ట్రస్టు నిర్వహణలో జరిగే రక్తదాన కేంద్రానికి ఇప్పటికే చాలా అవార్డులు వచ్చాయి. చిరంజీవి చారిటబుల్ ట్రస్టును 1998 అక్టోబర్ 2న అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా చిరంజీవి ప్రారంభించారు. అప్పటి నుంచి లక్షలాది మంది అభిమానులు రక్తదానం చేసారు.. చేస్తున్నారు. ఇప్పటికి దాదాపు 3.5లక్షల మంది తమ కళ్లను చిరంజీవి ఐ బ్యాంకుకు దానం ఇచ్చారు. ఈ బ్యాంకు ద్వారా ఇప్పటికి 2వేల మందికి చూపు అందించారు కూడా.

 

 

ఈ సందర్భంగా నేటి సాయంత్రం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో బ్లడ్ బ్యాంకుకు వచ్చిన అవార్డును బహుకరించనున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు.. మెగా అభిమానులకు, రక్తదాతలకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. చిరంజీవి రాష్ట్ర యువత కూడా ఈ కార్యక్రమంలో అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిస్తోంది. చిరంజీవి సంపాదించిన అభిమాన బలం మీదే మెగా హీరోలందరూ సినీ పరిశ్రమకు పరిచయమై స్టార్లు, సూపర్ స్టార్లుగా ఎదిగారనేది సత్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: