డాక్టర్ ప్రియాంక రెడ్డి కి జరిగిన దారుణమైన పరిస్థితి తర్వాత యావత్తు భారతదేశమే ఊగిపోయింది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నుండి బాలీవుడ్ లోని బడా స్టార్లంతా ఆమెకు జరిగిన అన్యాయానికి న్యాయం చేకూరాలని పట్టుబడుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో సినీ నటి నిత్యా మీనన్ తన కెరీర్ తొలినాళ్లలో తాను అనుభవించిన విషయాల గురించి అనూహ్యంగా వెల్లడించారు. 

 

మామూలుగా నిత్య చాల ముక్కుసూటి మనిషి. తన మనసుకు ఏది తోస్తే అది ఉన్నదున్నట్టు మొహం మీద మాట్లాడడం అలవాటు. ఆఖరికి తన కెరీర్ విషయంలో కూడా ఏనాడూ రాజీ చెందని నిత్యా... స్టార్ హీరోలతో సినిమా ఆఫర్లు వచ్చినా అందులో తన పాత్ర సరిగ్గా లేకపోతే నేను చేయలేను అని చెప్పేసి తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉందని ఎన్నో సార్లు నిరూపించుకుంది. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు దక్షిణ భారత దేశమంతా ఆమెను ఎంతో గౌరవిస్తుంది.

 

అయితే జూనియర్ సౌందర్యగా పిలువబడే నిత్యా మీనన్ మీడియాతో మాట్లాడుతూ అమ్మాయిలు పని చేసే చోట చెడు ప్రవర్తన ఎదురైతే వారికి ఎలా గుణపాఠం చెప్పాలో కూడా కొన్ని సూచనలు ఇచ్చింది. తనకు కూడా అలాంటి అనుభవాలు ఎదురయ్యాయని... అయితే చెడుగా ప్రవర్తించిన వాళ్లను పిలిచి బయటకు పొమ్మని హెచ్చరించానని నిత్యా వెల్లడించారు. "మీకు గౌరవం అవసరం లేదా? అది మిగలాలంటే చెడు ప్రవర్తన వద్దు!" అని వార్నింగ్ ఇచ్చినట్లు తెలిపారు.

 

చెడు ప్రవర్తన అనేది అన్నిచోట్లా ఉంది. కేవలం సినీపరిశ్రమలోనే కాదు అని నిత్యా మీనన్ పేర్కొంది. మనం తప్పు దారిలో లేనప్పుడు మనకు అలాంటివి ఎదురవ్వవు. మనం ఒప్పుకుంటేనే సమస్య అని స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు నటి నిత్యామీనన్. మరి నిత్యామీనన్ చెప్పిన మాటలు విని అమ్మాయిలంతా ధైర్యంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: