మీడియం రేంజ్ హీరోలలో అగ్రస్థానంలో కొనసాగుతున్న నాని టాప్ యంగ్ హీరోల లిస్టులోకి చేరాలని ప్రయత్నిస్తున్నా పరిస్థితులు కలిసిరావడం లేదు. నాని ఎన్ని ప్రయత్నాలు చేసినా అతడి మార్కెట్ 40కోట్లకు దాటడం లేదు. దీనితో నాని 100కోట్ల కలక్షన్స్ క్లబ్ లో చేరాలని కంటున్న కలలు పగటి కలలుగానే మిగిలి పోతున్నాయి.

ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ‘వి’ మూవీలో నటిస్తున్న నాని ఈమూవీ షూటింగ్ చివరకి రావడంతో తనకు ‘నిన్ను కోరి’ లాంటి మంచి హిట్ ఇచ్చిన శివ నిర్వాణతో మళ్ళీ జత కడుతున్నాడు. ఈ మూవీ షూటింగ్ డిసెంబర్ నుండి ప్రారంభం కాబోతోంది. ఈ మూవీలో ‘పెళ్ళి చూపులు’ మూవీతో పాపులర్ అయిన రీతు వర్మను హీరోయిన్ గా ఎంపిక చేసారు. 

అయితే ఆమెకు చెప్పుకోతగ్గ స్థాయిలో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు లేదు. ఇప్పుడు రీతు వర్మను నాని పక్కన హీరోయిన్ గా ఫిక్స్ చేయడంతో నానికి స్టార్ హీరోయిన్స్ అంటే విరక్తి ఉందా అన్న ఆ సక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఈమధ్య కాలంలో నాని నటించిన హీరోయిన్స్ లిస్టు పరిశీలిస్తే ఎవరికైనా కొంత ఆశ్చర్యం కలుగుతుంది. క్రేజీ హీరోయిన్స్ గా గుర్తింపు పొందకముందు కీర్తి సురేశ్ సాయి పల్లవి లతో నటించిన నాని ఆతరువాత రష్మికతో ‘దేవదాసు’ సినిమాలో నటించినా రష్మికను నాని పక్కన హీరోయిన్ గా ఎంపిక చేసే సమయానికి ‘గీత గోవిందం’ విడుదల కాలేదు. 

వీరు ముగ్గురు తప్ప నాని నటించిన అన్ని సినిమాలలోను బిగ్రేడ్ హీరోయిన్స్ మాత్రమే నటించారు. ఈలిస్ట్ లో నివేదా థామస్ అనుపమ పరమేశ్వరన్ శ్రద్ధా శ్రీనాద్ ప్రియాంక అరుల్ మోహన్ లాంటి వాళ్ళు చాలమంది ఉన్నారు. అయితే ఇప్పుడు క్రేజీ హీరోయిన్స్ గా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పూజ హెగ్డే కియారా అద్వాని లాంటి వాళ్ళను నాని ఎందుకు పక్కకు పెట్టేస్తున్నాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు, నానీకి ఉన్న మంచి పేరు రీత్యా టాప్ హీరోయిన్స్ నాని పక్కన నటిస్తారని అయితే నాని వారిపై దృష్టి పెట్టకపోవడం వెనుక వారి పై విరక్తి అనుకోవాలా లేద్మతే నిర్మాతలకు మరింత బడ్జెట్ పెంచకూడదు అన్న ఉద్దేశ్యం అనుకోవాలా అంటూ నాని టాప్ హీరోయిన్స్ పై పెంచుకున్న నైరాశ్యం వెనుక కారణాలు ఏమిటి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: