ఎప్పుడైతే అర్ధరాత్రి కూడా ఆడది ఒంటరిగా రోడ్లపై నడుస్తుందో అప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినట్టుగా పెద్దలు చెబుతారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి చాలా ఏళ్లు అవుతున్నా ఆడవాళ్లకు మాత్రం వ్యక్తిగత స్వాతంత్రం రాలేదని చెప్పాలి. మనిషి పుట్టుకకు కారణమైన మహిళల మీద మానవ మృగాలు చేస్తున్న దాడులు చూసి ఎలా స్పందించాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.

 

నిర్భయ నుండి నేటి ప్రియాంకా రెడ్డి వరకు మనుషులు ఇంత క్రూరంగా తయారవుతున్నారు ఎందుకు..? అసలు 5 నిమిషాల సుఖం కోసం ఓ మనిషి ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారు..? ఇంత బరితెగింపు చర్యలు దేని తార్కాణాలు అన్నది తెలియట్లేదు. ఎన్ని చట్టాలు.. ఎన్ని శిక్షలు ఉన్నా ఒకటి మరచే లోగా మరోటి ఇలాంటిది ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి.  

 

ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే శిక్ష వేసే చట్టాలు.. న్యాయస్థానాలు ఉన్నప్పుడు మాత్రమే వీటిని అడ్డుకునే ఛాన్స్ ఉంది. తప్పు జరిగిన వెంటనే శిక్ష వేసే చట్టాలు మన దగ్గర లేవా అంటే అదంతా అధికారుల చేతుల్లోనే ఉందని మాత్రం చెప్పొచ్చు. వరంగల్ ఘటనలో అప్పటి సిఎం వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఎన్ కౌంటర్ చేయడం కరెక్ట్ అనిపించింది.

 

తల్లిదండ్రుల కారణంగా పుట్టుక జరిగితే మానవ మృగాల వల్ల ఓ మహిళ ప్రాణాలు అర్పించడం కాదు మహిళ ప్రాణాలను తీయడం అన్నది ఎంతవరకు కరెక్ట్. ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరుగకుండా ఉండాలంటే నిందితులను వెంటనే శిక్షించాలి. అప్పుడే మరొకరు అలా ఆలోచించడానికైనా భయపడతారు. శిక్షలు భయకరంగా ఉన్నప్పుడే తప్పు చేయాలన్న ఆలోచన వచ్చినా భయం వేసి ఆగిపోతారు. మరి ఇక మీదట అయినా మహిళ మీద ఇలాంటి సంఘటనలు జరుగకుండా చూసుకుంటే మంచిది. ఇది మన అందరి బాధ్యత అని కూడా చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: