‘ఎఫ్ 2’ సక్సస్ తరువాత వెంకటేష్ నాగచైతన్యతో కలిసి నటిస్తున్న ‘వెంకీ మామ’ మూవీ వాస్తవానికి దసరా పండుగకు రావలసిన మూవీ. అయితే ‘సైరా’ మ్యానియాకు భయపడి ఈ మూవీని వాయిదా వేసారు. అప్పటి నుంచే ఈ మూవీ కన్ఫ్యూజన్ మొదలైంది. 

సినిమా డిసెంబర్ లో విడుదల అవుతుంది అని లీకులు వస్తున్నాయి. కానీ ఈ మూవీ రిలీజ్ డేట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ మూవీ డిసెంబర్ 13న విడుదల అవుతుంది అంటూ కొన్ని లీకులు వస్తుంటే ఈ మూవీ డిసెంబర్ 25న విడుదల అవుతుంది అంటూ మరికొన్ని లీకులు వస్తున్నాయి. 

మూవీ నిర్మాత సురేశ్ బాబు కూడ ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి స్పష్టంగా క్లారిటీ ఇవ్వని నేపధ్యంలో డిసెంబర్ ను టార్గెట్ చేసుకుంటూ విడుదల కావలసిన అనేక సినిమాలు కన్ఫ్యూజ్ అవుతున్నాయి. కేవలం దర్శక నిర్మాతలు మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులు కూడ ‘వెంకీ మామ’ గురించి కన్ఫ్యూజ్ అవుతున్న నేపధ్యంలో ‘వెంకీమామ రిలీజ్ ఎప్పుడమ్మా’ అనే హ్యాష్ ట్యాగ్ ను క్రియేట్ చేసి సురేష్ బాబును ట్యాగ్ చేస్తూ ఈ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు వెంకటేష్ నాగచైతన్య అభిమానులు.

 

వాస్తవానికి ఈ సినిమా విడుదల గురించి వెంకటేష్ చైతన్య అభిమానులు బాగా ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనితో ఈ మూవీ రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్ వెంకీ చైతు అభిమానులకు కూడ అసహనాన్ని కలిగిస్తోంది అన్న విషయం ఈ హ్యాష్ ట్యాగ్ తో క్లారిటీకి వస్తోంది. ఈ గందరగోళం ఇలా కొనసాగుతూ ఉంటే ఈమూవీని ఎదో విధంగా సంక్రాంతి రేస్ లో ఇరికించి లాభ పడాలి అన్న సురేశ్ బాబు ఆలోచనలు అతడిని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి అని అంటున్నారు. ఈ మూవీకి ఉన్న పాజిటివ్ టాక్ రీత్యా ఫ్యామిలీ ప్రేక్షకులను టార్గెట్ చేయడానికి సురేశ్ బాబు తాను కన్ఫ్యూజ్ అవుతూ ‘వెంకీ మామ’ ను కూడ కన్ఫ్యూజ్ చేస్తూ ఈ మూవీ పై ఉన్న ప్రీ పాజిటివ్ టాక్ ను పాడుచేస్తున్నాడు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: