వరుణ్‌తో ‘తొలిప్రేమ’ అనేసి.. రవితేజతో ‘టచ్ చేసి చూడ’మని.. ప్రేక్షకుల ‘ఊహలు గుసగుసలాడే’లా చేసిన హాట్ బ్యూటీ రాశీ ఖన్నా. ఎప్పుడూ ప్రేక్ష‌కుల గుండెల్లో ఇన్‌స్టాగ్రామ్‌కే హీట్ పుట్టించే ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఊహలుగుసగుసలాడే, సుప్రీమ్, రాజా ది గ్రేట్, జై లవకుశ వంటి హిట్ చిత్రాలతో బిజీ  అయిపోయింది.

 

తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో రాశి ఖన్నా ఒకరు. అమాయకత్వంతో కూడిన అందం రాశిఖన్నా సొంతం. కెరియర్ ను మొదలెట్టిన దగ్గర నుంచి నిదానమే ప్రధానమన్నట్టుగా ఆమె ఒక్కో సినిమా చేసుకుంటూ వెళుతోంది. ఇక ఈ అందాల రాశి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఆమె తాజా చిత్రాల నుంచి స్పెషల్ వీడియోలను వదులుతున్నారు.

 

తాజాగా 'వెంకీమామ' టీమ్ ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సినిమా నుంచి సందర్భానికి తగిన ఒక డైలాగ్ వీడియోను విడుదల చేశారు. వెంకటేశ్ - పాయల్ ఒక జంటగా కనిపించనున్న ఈ సినిమాలో ఆమె చైతూకి జోడీగా అలరించనుంది. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, 'క్రిస్మస్' కానుకగా డిసెంబర్ 25వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఇప్పుడు ప్ర‌స్తుతం ఈ భామ మారుతి ద‌ర్శ‌క‌త్వంలో సుప్రీం హీరో సాయి ధ‌ర‌మ్‌తేజ్‌తో ప్ర‌తిరోజు పండ‌గే చిత్రంలో కూడా న‌టిస్తుంది ఇక ఈ చిత్రం షూటింగ్ కూడా ఇటీవ‌లె పూర్త‌యింది. మ‌రి ఫుల్ ఫాంలో ఉన్న ఈ హీరోయిన్ ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు మెప్పిస్తుందో వేచి చూడాలి. ఇక రాశీ ఖన్నాఇక్క‌డే కాకుండా తమిళ తంబీలను కూడా ఆకట్టుకునే పనిలో భాగంగా తమిళ్‌లో వరుస సినిమాలు చేస్తుంది. కెరియర్ స్టార్టింగ్‌లో బొద్దుగుమ్మగా ఉండే రాశీ ఖన్నా.. ఈ మధ్య నాజూకు సుందరిగా మారింది. తన లేలేత అందాలను బహిర్గతం చేస్తూ హాట్ హాట్ లుక్స్‌తో సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: