లావణ్యా త్రిపాఠి..ఉత్తరాది అమ్మాయి. ఆమె అందాల రాక్షసి. అయిదేళ్ళ క్రితం విడుదల అయిన ఆ సినిమాతో ఒక్కసారి టాలీవుడ్లో కొత్తందంగా మెరిసింది.  అభినయంలోనూ మంచి మార్కులను తొలి సినిమాతొనే వేసుకుంది. ఇక లావణ్య పేరుకు తగినట్లుగా సౌందర్యమే. ఆమెలో ప్రత్యేక ఆకర్షణ ఉంది. అదే సూదంటు రాయిలా మారి యూత్ హార్టులను  లాగేసుకుంటోందని అంటారు. 

 

ఇక లావణ్య అందం అంతా ఆమె నవ్వులోనే ఉందని మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు కూడా కితాబు ఇచ్చేశారు. భలె భలే మొగాడివోయ్ మూవీలో లావణ్య నటనకు ఫిదా అయిన వారు ఎంతో మంది ఉన్నారు.  ఇదిలా ఉండగా నాగార్జున సరసన సోగ్గాడే చిన్నినాయనా మూవీలో మెరిసిన లావణ్య టాప్ స్టార్ గా ఎదుగుతుందని అంతా అనుకున్నారు.

 

అయితే లావణ్య సెలెక్ట్ చేసుకున్న పాత్రలు, చిత్రాలు ఒక్కసారిగా  ఢామ్మనడంతో ఆమె ఎక్కడ నుంచి వచ్చిందో అక్కడే ఉండిపోయింది. వరసగా ఆమె మూవీస్ ఫ్లాప్  అవుతూంటే ఎవరూ కూడా ఒక్క చాన్స్ ఇవ్వలేదు. ఈ టైంలో అర్జున్ సురవరం మూవీపైనే లావణ్య కోటి ఆశలు పెట్టుకుంది. నిజానికి ఈ మూవీ నాలుగైదు నెలల క్రితం విడుదల కావాలి.

 

ఇపుడు అన్ని అడ్లూ తొలగించుకుని రిలీజ్ కావడమే కాదు, హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీలో హీరో నిఖిల్ పక్కన సపోర్ట్ చేస్తూ లావణ్య వేసిన క్యారక్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందంతో పాటు నటనకు కూడా అవకాశం ఉన్న పాత్రలో ఆమె కనిపించింది. ఈ మూవీ హిట్ కావడంతో మళ్ళీ రెచ్చిపోతాను అంటోంది లావణ్య.

 

మరి లావణ్యకు ఇకనైనా ఆఫర్లు వస్తాయా అన్నది చూడాలి. సినిమా ఫెయిల్ అయితే హీరోయిన్లు డైరెక్టర్లదే తప్పు అంటూ తోసేసే సైకాలజీ ఉన్న పరిశ్రమలో లావణ్యకు కొత్త చాన్సులు వస్తాయా అన్నది కూడా ఆలోచించాలి. ఏది ఏమైనా అర్జున్ సురవరం మూవీతో తాను మళ్ళీ లైం లైట్ లోకి వచ్చానని, తన సత్తా చూపిస్తానని లావణ్య గట్టిగానే చెబుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: