బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ అయిన రాహుల్ సిప్లిగంజ్ కు ప్రస్తుతం విపరీతమైన క్రేజ్ ఉందనే చెప్పాలి. నిజానికి అంతకముందు బిగ్ బాస్ షోల్లో విన్నర్లుగా నిలిచిన శివ బాలాజీ, కౌశల్ పేర్లు మొదట్లో కొంత హల్ చల్ చేసినప్పటికి, వారు ఆ ఇమేజ్ ని సరిగ్గా వినియోగించుకోలేకపోయారు అనే విమర్శలు వినిపించాయి. కానీ రాహుల్ మాత్రం వారి మాదిరిగా కాకుండా తనకు వచ్చిన ఇమేజ్ ని పక్కాగా వినియోగించుకునేలా ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ కు మరియు ప్రజలకు బాగా చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

ఇటీవల ఫ్యాన్స్ కోసం హైదరాబాద్ లో ఒక పెద్ద లైవ్ కాన్సర్ట్ చేసిన రాహుల్, మధ్య మధ్యలో కొన్ని ఫంక్షన్స్ కు కూడా హాజరవుతూ తన ఫ్యాన్స్ కి మంచి ఉత్తేజాన్ని అందిస్తున్నారు. ఇకపోతే ఆయన నేడు ఒక తెలుగు సినిమాలో భారీ ఆఫర్ ని కొట్టేసారు. కాగా ఆ విషయాన్ని స్వయంగా రాహుల్ తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా తెలియపరచడం జరిగింది. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశి దర్శకత్వంలో అతి త్వరలో తెరకెక్కబోతున్న భారీ మూవీ రంగమార్తాండలో తాను ఒక మంచి క్యారెక్టర్లో నటించబోతున్నానని, 

 

సినిమా ద్వారా నటుడిగా తన టాలీవుడ్ డెబ్యూ జరుగుతోందని రాహుల్ ఆనందంగా ట్వీట్ చేయడం జరిగింది. రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్ వంటి దిగ్గజ నటులు నటిస్తున్న ఈ సినిమా, మరాఠీ సినిమా నటసామ్రాట్ కు రీమేక్ గా తెరకెక్కుతోంది. మరి తొలి సినిమాతో రాహుల్ తన నటనతో ప్రేక్షకులును ఏ విధంగా ఆకట్టుకుంటాడో, అలానే ఎప్పటినుండో వరుసగా ఫ్లాప్స్ చవిచూస్తున్న కృష్ణవంశీ ఈ సినిమాతో ఎంత మేర సక్సెస్ ని అందుకుంటారో చూడాలి. కాగా అతి త్వరలో పట్టాలెక్కనున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ భావిస్తోంది....!!   

మరింత సమాచారం తెలుసుకోండి: