ఇండస్ట్రీలో కొన్ని వార్తలు ఎలా పుట్టుకు వస్తాయో తెలియకపోయినా ఆ వార్తలు నిజమైనా అని అనిపించేలా ఉంటాయి. అయితే ఆ తరువాత ఆ వార్తలను కేవలం గాసిప్పులుగా పరిగణిస్తూ ఆ వార్తలకు సంబంధించిన వారు కొట్టిపారేస్తూ ఉంటారు. 

‘పింక్’ రీమేక్ ను పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేయడం ఒక జీవిత ధ్యేయంగా పెట్టుకున్న దిల్ రాజ్ పవన్ ను ఈ రీమేక్ విషయంలో ఒప్పించడానికి త్రివిక్రమ్ కు ఎటువంటి పెట్టుబడి లేకుండా కేవలం రైటింగ్ స్కిల్స్ కే యాభైశాతం లాభాలు ఇస్తాను అని మాట ఇచ్చినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ మూవీ ప్రాజెక్ట్ కు పవన్ ఓకే చెప్పిన తరువాత దిల్ రాజ్ చాలతెలివిగా వ్యవహరిస్తూ  త్రివిక్రమ్ ను ఆయన అంతట ఆయన దూరం అయ్యేలా చేసారు అంటూ ఇప్పుడు ఒక సరికొత్త గాసిప్ ప్రచారంలోకి వచ్చింది. 

జరుగుతున్న పరిణామాలు త్రివిక్రమ్ దృష్టి వరకు వెళ్ళడంతో త్రివిక్రమ్ తనకు తానుగా ఈ మూవీ ప్రాజెక్ట్ దూరం అయ్యాడు అన్నమాటలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ ప్రాజెక్ట్ కు దర్శకుడిగా ఉన్న వేణు శ్రీరామ్ స్క్రిప్ట్ వర్క్ కూడా చేయలగల వ్యక్తి కాబట్టి త్రివిక్రమ్మూవీ ప్రాజెక్ట్ నుండి దూరం అయినా దిల్ రాజ్ కు వచ్చే నష్టం లేదు సరికదా అతడికి అదనంగా మరో 50శాతం లాభాలు మిగులుతాయి అంటూ కొందరు జోక్ చేస్తున్నారు. 

అయితే పవన్ కు దిల్ రాజ్ త్రివిక్రమ్ విషయంలో అనుసరించిన వ్యూహాలు తెలిస్తే తన ప్రియమిత్రుడికి దిల్ రాజ్ ఇచ్చినన షాక్ కు సమాధానంగా పవన్ షాక్ మరో విధంగా ఉన్నా ఆశ్చర్యం లేదు అని మరి కొందరు అభి ప్రాయ పడుతున్నారు. దీనితో వాటాల పంపకంలో ఏర్పడ్డ చిచ్చు ‘పింక్’ రీమేక్ విషయంలో అసలుకు చిచ్చు పెడుతుందా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: